Begin typing your search above and press return to search.

మెగా ఆఫర్.. శ్రీలీల రిజెక్ట్ చేసిందా?

తాజాగా మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో ఐటెం సాంగ్ కోసం శ్రీలీలని సంప్రదించారంట. ఆమె చేయనని వారికి చెప్పేసిందని తెలుస్తోంది. ఐటెం సాంగ్స్ చేసే ఉద్దేశ్యం లేదని శ్రీలీల క్లారిటీ ఇచ్చిందంట.

By:  Tupaki Desk   |   17 Aug 2024 11:14 AM GMT
మెగా ఆఫర్.. శ్రీలీల రిజెక్ట్ చేసిందా?
X

కమర్షియల్ హీరోయిన్ గా సక్సెస్ అవ్వాలని ప్రయత్నం చేస్తోన్న అందాల భామ శ్రీలీలకి కెరియర్ పరంగా ఆశించిన స్థాయిలో విజయాలు లేవు. సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా చేసిన గుంటూరు కారం సినిమాపైన శ్రీలీల చాలా హోప్స్ పెట్టుకుంది. అయితే ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ కాలేదు. అలాగే మూవీలో ఆమె పాత్ర పాటలకే పరిమితం అయ్యింది తప్ప పెద్ద పెర్ఫార్మెన్స్ కి స్కోప్ లేదు.

మరో వైపు పవన్ కళ్యాణ్ తో చేస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు. దీంతో ప్రస్తుతం శ్రీలీల హోప్స్ అన్ని రాబిన్ హుడ్ మూవీ మీదనే ఉన్నాయి. రీసెంట్ గా రవితేజకి జోడీగా నటించడానికి మరోసారి శ్రీలీల ఒకే చెప్పేసింది. ఇప్పటికే రవితేజ, శ్రీలీల కాంబినేషన్ లో వచ్చిన ధమాకా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో క్రేజీ కాంబినేషన్ గా ఈ జోడీ మరోసారి సందడి చేయడం గ్యారెంటీ అనే టాక్ వినిపిస్తోంది.

తెలుగులో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కాకుండా రెండు సినిమాలు శ్రీలీల చేతిలో ఉన్నాయని అర్ధమవుతోంది. హిందీలో సిద్ధార్ధ్ మల్హోత్రాకి జోడీగా నటించడానికి శ్రీలీల ఒకే చెప్పేసిందంట. ఈ సినిమాతో గ్రాండ్ గా బాలీవుడ్ లోకి అడుగుపెడతానని ఈ బ్యూటీ నమ్మకంగా ఉంది. ఇదిలా ఉంటే శ్రీలీల మంచి డాన్సర్ అని అందరికి తెలిసిందే. దీంతో ఆమెని పెట్టి స్పెషల్ ఐటెం సాంగ్స్ చేయించాలని చాలా మంది దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఆమె మాత్రం వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదంట. తాజాగా మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో ఐటెం సాంగ్ కోసం శ్రీలీలని సంప్రదించారంట. ఆమె చేయనని వారికి చెప్పేసిందని తెలుస్తోంది. ఐటెం సాంగ్స్ చేసే ఉద్దేశ్యం లేదని శ్రీలీల క్లారిటీ ఇచ్చిందంట. దీంతో విశ్వంభర యూనిట్ త్రిప్తి డిమ్రిని సంప్రదించారంట. ప్రస్తుతం బాలీవుడ్ లో త్రిప్తి మోస్ట్ బిజియస్ట్ యాక్టర్ గా ఉంది.

వరుస షూటింగ్స్ లో ఆమె బిజీగా ఉంది. ఈ కారణంగా ఐటెం సాంగ్స్ కోసం డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టం అని చెప్పిందంట. దీంతో ఇప్పుడు విశ్వంభరలో ఆ సాంగ్ షూట్ హోల్డ్ లో పడిందంట. ఐటెం సాంగ్ కోసం యాక్టర్ ఫైనల్ అయిన వెంటనే ఆ సాంగ్ షూట్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారంట. విశ్వంభర మూవీ షూటింగ్ కూడా ఆల్ మోస్ట్ కంప్లీట్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 10, 2025న ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.