Begin typing your search above and press return to search.

ఆ సినిమా కోసం గట్టిగా డిమాండ్ చేస్తున్న శ్రీలీల?

టాలీవుడ్ మోస్ట్ బిజీయోస్ట్ హీరోయిన్ శ్రీలీలకు ఈ రోజుల్లో అస్సలు పరిచయం అవసరం లేదు. పెళ్లి సందD మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది బ్యూటీ శ్రీలీల

By:  Tupaki Desk   |   14 Oct 2023 5:27 AM GMT
ఆ సినిమా కోసం గట్టిగా డిమాండ్ చేస్తున్న శ్రీలీల?
X

టాలీవుడ్ మోస్ట్ బిజీయోస్ట్ హీరోయిన్ శ్రీలీలకు ఈ రోజుల్లో అస్సలు పరిచయం అవసరం లేదు. పెళ్లి సందD మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది బ్యూటీ శ్రీలీల . తెలుగులో అడుగుపెట్టడానికి మందే కన్నడలో రెండు సినిమాలు చేసింది. అక్కడ కాస్త గుర్తింపు తెచ్చుకున్న ఈ తెలుగు అందం ఆ తర్వాత తెలుగులోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే అందరి దృష్టి ఆకర్షించేసింది. సినిమా క్లిక్ అవ్వకపోయినా, శ్రీలీల పై మాత్రం దర్శక నిర్మాతల కన్నుపడింది.

దీంతో, ఆమెకు వరసగా ఆఫర్లు క్యూలు కడుతున్నాయి. ఎంతలా ఉంటే, టాలీవుడ్ లో రిలీజ్ కి దగ్గరపడుతున్న ఏ సినిమా చూసినా అందులో శ్రీలీలే కనిపించడం విశేషం. రాబోయే చిత్రాల్లోనూ ఆమెనే తీసుకోవాలని మేకర్స్ చూస్తున్నారు. ఈ క్రమంలో తనకు ఉన్న క్రేజ్ ని దృష్టిలో ఉంచుకొని ఈ బ్యూటీ కూడా రెమ్యూనరేషన్ పెంచేయడం విశేషం.

మొదట్లో రూ. కోటి రెమ్యూనరేషన్ తీసుకున్న శ్రీలీల ఆ తర్వాత రెండు కోట్లకు పెంచేసింది, అయితే, ఇప్పుడు ఏకంగా రూ.5కోట్లు డిమాండ్ చేస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా శ్రీలీలకు ప్రభాస్ తో సినిమా చేసే ఆఫర్ వచ్చింది. ఇంత తక్కువ కాలంలో మహేష్, ప్రభాస్ లాంటి హీరోల పక్కన నటించే ఆఫర్ రావడం అంటే మామూలు విషయం కాదు. కానీ, ఆమెలో ఉన్న టాలెంట్, అందానికి ఫిదా అయిపోయి దర్శక నిర్మాతలు ఆమెనే హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటుున్నారు.

ఇప్పటికే, శ్రీలీల తనకున్న బిజీ షెడ్యూల్స్ మధ్య చాలా సినిమాలను వదిలేసుకుంటోంది. అయితే, ప్రభాస్ లాంటి హీరో పక్కన నటించే ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోలేదు కదా, అందుకే ఆ ఆఫర్ ఒకే చెప్పిందట. హను రాఘవపూడి ఆ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. అయితే, ఈ మూవీ చేయడానికి గట్టిగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందనే ప్రచారం జరుగుతోంది.

ఆమెకు ప్రస్తుతం డిమాండ్ ఉంది కాబట్టి, అడగడంలో తప్పు లేదు అని కొందరు భావిస్తున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో చూడాలి. ఇక, శ్రీలీల బాలయ్య భగవంథ్ కేసరి మూవీ విడుదలకు రెడీ అయింది. అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తరువాత ఆదికేశవ మూవీతో ఆమె మరోసారి ప్రేక్షకులను పలకరించనుంది.