శ్రీలీల పచ్చ కోక ఖరీదెంతో తెలుసా?
ఇప్పుడు 'గుంటూరు కారం' ప్రీరిలీజ్ ఈవెంట్లో శ్రీలీల కట్టుకున్న పచ్చ (బాటిల్ గ్రీన్) చీర గురించి బోలెడంత చర్చ సాగుతోంది
By: Tupaki Desk | 10 Jan 2024 2:15 PM GMTInడిజైనర్ చీరలతో మతులు చెడగొట్టడం ఎలానో మన అందాల కథానాయికలకే తెలుసు. అల్ట్రా స్టైలిష్ మోడ్రన్ లెహంగాలు, డిజైనర్ మిడీలు, డెనిమ్స్ ఇలా అన్ని రకాలుగా ప్రయోగాలు చేసే భామలు చీరల్లోను సంథింగ్ స్పెషల్ గా కనిపించేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని జారవిడువరు. ముఖ్యంగా సినిమా ఫంక్షన్లలో చీరలో కనిపిస్తే ఉండే ఎట్రాక్షన్ వేరు.
ఇప్పుడు 'గుంటూరు కారం' ప్రీరిలీజ్ ఈవెంట్లో శ్రీలీల కట్టుకున్న పచ్చ (బాటిల్ గ్రీన్) చీర గురించి బోలెడంత చర్చ సాగుతోంది. ఈ చీరలో శ్రీలీల అందం పదింతలైంది. మెరుపుల్లాంటి చెంపలు.. మిలమిల మెరిసే కళ్లతో ఈ అమ్మడు ఎంతగా మాయ చేసిందో దానికి మించి బాటిల్ గ్రీన్ చీర తళుకుబెళుకులు కుర్రకారు మనసును పట్టి గుంజేసాయి.
ఇంతకీ ఈ చీర ఖరీదు ఎంత? మార్కెట్లో ఎంత ధరకు దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? అంటూ ఆరాలు తీస్తున్నారు అమ్మాయిలు. ఆన్ లైన్ లో వెతికితే ఇది ఏ బ్రాండ్? ధర ఎంత అన్న వివరాలు లభించాయి. ఇది బాటిల్ గ్రీన్ కట్ వర్క్ శారీ.. దీని ఖరీదు 1,59,000. అక్షరాలా ఒక లక్షా యాభై తొమ్మిదివేలు. అయితే ఇంత పెద్ద ధర చూసి యూత్ నోరెళ్లబెడుతోంది. ఇది చూడటానికి చాలా సింపుల్ గా కనిపించినా కానీ ధర మాత్రం టూమచ్ గా ఉందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.
శ్రీలీల నటించిన గుంటూరు కారం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలవుతోంది. ఇందులో మహేష్ , మీనాక్షి చౌదరి తదితరులు నటించారు. ఇంతకుముందే విడుదలైన మాస్ యాక్షన్ ట్రైలర్ అభిమానులను ఉర్రూతలూగించింది. మహేష్ కెరీర్ బెస్ట్ ఓపెనింగులతో గుంటూరు కారం రికార్డులు క్రియేట్ చేస్తుందని అంచనాలేర్పడ్డాయి. ఇప్పటికే ప్రీబుకింగ్స్ జోరు కొనసాగుతోంది.