శ్రీలీల.. చీరలో నిన్ను కొట్టేవారే లేరు
ఇక 2023లో శ్రీలీల నటించిన నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో 'భగవంత్ కేసరి' మాత్రమే మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.
By: Tupaki Desk | 17 Jun 2024 7:58 AM GMTక్యూట్ టాలెంటెడ్ హీరోయిన్ గా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నటి శ్రీలీల, 'పెళ్లిసందD' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, రవితేజ సరసన నటించిన 'ధమాకా' సినిమాతో బాక్సాఫీస్ హిట్ సాధించింది. ఈ విజయంతో ఆమె క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. కానీ తర్వాతి చిత్రాలు ఆశించిన విజయాన్ని అందించకపోవడంతో ఆమె కెరీర్ లో కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది.
ఇక 2023లో శ్రీలీల నటించిన నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో 'భగవంత్ కేసరి' మాత్రమే మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. మిగతా మూడు సినిమాలు అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయాయి. తాజాగా సంక్రాంతికి వచ్చిన 'గుంటూరు కారం' కూడా మిక్సడ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఈ సమయానికి శ్రీలీల కోసం వచ్చిన కొన్ని అవకాశాలు కూడా చేజారిపోవడం కొంత నిరాశ కలిగించింది.
ఇక శ్రీలీల కొంత సైలెంట్ గా ఉంటూ, కెరీర్ పరంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటోంది. ఆమె కొత్త కథలను జాగ్రత్తగా ఎంపిక చేయాలని నిర్ణయించుకుంది. సోషల్ మీడియాలో కూడా గ్లామర్ లుక్స్ తో మళ్లీ స్పీడ్ పెంచుతోంది. రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఆరెంజ్ కలర్ చీరలో అమ్మడు ఇచ్చిన స్టిల్స్ వావ్ అనేలా ఉన్నాయి. ఇక ఆ అందానికి తన నవ్వును జత చేస్తూ మరో లెవెల్లో ఎట్రాక్ట్ చేసింది.
ఈ ఫొటోలలో శ్రీలీల చాలా అందంగా ఉందంటూ చీర కడితే ఆమెను ఎవరు డామినేట్ చేయలేరని బిరుపించింది. ఇక ఆమె కెరీర్ విషయానికి వస్తే.. శ్రీలీలకు ఒక భారీ ఛాన్స్ వచ్చినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సరసన నటించే అవకాశం వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో అజిత్ హీరోగా తెరకెక్కుతున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం.
ఈ చిత్రాన్ని 'మార్క్ ఆంటోనీ' ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. మేకర్స్ ఆమెను సంప్రదించగా, కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ తో శ్రీలీల కెరీర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోతుందని వారు భావిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ఆమెకు వచ్చిన ఫ్లాపులు ఈ కోలీవుడ్ బిగ్ బ్రేక్ తో మరచిపోవచ్చని ఆశపడుతున్నారు. శ్రీలీల ఈ భారీ తమిళ ప్రాజెక్ట్ లో ఎలాంటి ఫలితం సాధిస్తుందో చూడాలి.