స్లీవ్ లెస్ సారీలో శ్రీలీల మురిపం!
వీలైనంత వరకూ డిజైనర్ దుస్తుల్లో కటౌట్ కి తగ్గ ఎంపికలతోనే హైలైట్ అవుతుంది.
By: Tupaki Desk | 15 July 2024 2:13 AM GMTశ్రీలీల నెట్టింట క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మడు ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా క్షణాల్లో వైరల్ అవుతుంది. యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోలకు ప్రమోట్ అవ్వడంతో సొగసరి క్రేజ్ రెట్టింపు అయింది. సొగసరి హాట్ అప్పీరియన్స్ కి తొలి నుంచి దూరమే. సెగలు పుట్టించే భంగిమలు..ఫోటోలకు మాత్రం దూరంగా ఉంటుంది. అలాగని స్కిన్ షోకి దూరంకాదు. ఓ మొతాదు డోస్ లో అలరిస్తుంటుంది. వీలైనంత వరకూ డిజైనర్ దుస్తుల్లో కటౌట్ కి తగ్గ ఎంపికలతోనే హైలైట్ అవుతుంది.
తాజాగా అమ్మడు నీలిరంగు చీరలో తళుక్కున మెరిసింది. స్లీవ్ లెస్ డిజైన్ అమ్మడిని మరింత అందంగా ప్రొజెక్ట్ చేస్తుంది. చీరపై ప్యాబ్రిక్ వర్క్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. శ్రీలీల బ్యూటీని ఆ సారీ మరింత రెట్టింపు చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. చీరపై మ్యాచింగ్ ట్రెండీ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ని ఎంచు కుంది. సంప్రదాయ చీరందానికి అమ్మడు మోడ్రన్ బ్యూటీని అద్భుతంగా జోడించింది.
చీర మ్యాచింగ్ ఎంపిక చేసుకున్న ప్రతీది చూపరులను ఆకర్షిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. చీరందంలో శ్రీలీల బ్యూటీని చూసి ప్యాన్స్ స్టన్ అవుతున్నారు. చీరలో అమ్మడు ఇంత అందంగా ఉందా? అంటూ కామెంట్ బాక్స్ లో ప్రపోజల్స్ గుప్పిస్తున్నారు. ఇలా చీరలో శ్రీలీల మురిపించడం కొత్తేం కాదు. మోడ్రన్ దుస్తులకంటే అమ్మడు ఎక్కువగా సంప్రదాయ చీర కట్టులోనే తనలో బ్యూటీని ఆవిష్కరి స్తుంది.
మోడ్రన్ ఎలివేషన్లకు తొలి నుంచి దూరంగానే ఉంది. ఇప్పటికీ అదే రూల్ తో ముందుకెళ్తుంది. ఇక నటిగా అమ్మడు కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. దీనిలో భాగంగా అమ్మడు కోలీవుడ్...బాలీవుడ్ అవకాశాలు కోసం ప్రయత్నిస్తుంది. ఇప్పటికే హిందీలో ఓ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నట్లు ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే.