పెళ్లి గురించి శ్రీముఖి ఏమంటోంది అంటే?
తాజాగా అమ్మడి వయసు నాలుగు పదులకు వస్తున్నా ఇంకా భాజాలు మోగించేది? లేదా? అన్న ప్రశ్న సొగసరి ముందుకెళ్లడంతో ఆసక్తిర విషయాలు పంచుకుంది.
By: Tupaki Desk | 1 March 2024 12:32 PM GMTశ్రీముఖి అలియాస్ బుల్లి తెర రామలమ్మ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. చిన్న తెరపై ఎంత కాంపిటీ షన్ ఉన్నా రాములమ్మ ప్రత్యేకత మాత్రం వేరు. యాంకర్లందరికంటే సమ్ థింగ్ స్పెషల్ అట్రాక్షన్ అమ్మ డి సొంతం. తనలో ఆ రేర్ క్వాలిటీనే మిగతా వాళ్ల నుంచి వేరు చేస్తుంది. సరైనా సినిమా ఛాన్సులు పడ లేదు..లేదంటే అక్కడా చిచ్చర పిడుగులా చెలరేగేది. అయినా అంది వచ్చిన ఏ అవకాశాన్ని విడిచి పెట్టడం లేదు.
తన లో హాట్ అప్పిరియన్స్ ని సందర్భం చిక్కినప్పుడల్లా ఇన్ స్టా వేదికగా షేర్ చేస్తూనే ఉంటుంది. అలాగే నటిగానూ సత్తా చాటే ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా అమ్మడి వయసు నాలుగు పదులకు వస్తున్నా ఇంకా భాజాలు మోగించేది? లేదా? అన్న ప్రశ్న సొగసరి ముందుకెళ్లడంతో ఆసక్తిర విషయాలు పంచుకుంది. 'వయసుతో పాటే పెళ్లి ప్రశ్నలు కూడా ఎక్కువ అవుతున్నాయని..ఎక్కడికి వెళ్లినా పెళ్లి ఎప్పుడు? అని అందరూ అడుగున్నారని అంది.
అలాగే ఇంట్లో వారు పెళ్లి చేసుకోమని ఒత్తిడి తీసుకురాలేదా? అని బయట జనాలు అడుగుతున్నారంది. కానీ తన విషయంలో తల్లిదండ్రులు పూర్తి స్వేచ్చ కల్పించారని..ఎప్పుడు చేసుకోవాలనుకుంటే అప్పుడే చేసుకోమని చెప్పారని తెలిపింది. అలాగే గతంలో తనకి ఓ లవర్ ఉండేవాడని..అతడితో ఇప్పుడు బ్రేకప్ అయిందని అప్పటి నుంచి ప్రేమకు దూరంగా ఉంటున్నట్లు తెలిపింది. ప్రస్తుతం శ్రీముఖి యాంకర్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
అనసూయ నటిగా బిజీ అవ్వడంతో ఆస్థానాన్ని అమ్మడు భర్తి చేసిందని చెప్పొచ్చు. సుమ లాంటి సీనియర్ యాంకర్లు ఉన్నా అక్కా అంటూ కలుపుకుని కొత్త అవకాశాలు ఒడిసి పట్టుకుంటుంది. ఆ సీనియర్ రేసు నుంచి తప్పుకుంటే ఆస్థానం తనదే అవుతుంది అన్న ధీమాతోనూ కనిపిస్తుంది.