Begin typing your search above and press return to search.

థై స్లిట్ ఫ్రాక్‌లో యాంకర్ శ్రీ‌ముఖి

మొన్న‌టికి మొన్న త‌న షూటింగ్ లొకేష‌న్ లో కార‌వ్యాన్ నుంచి శ్రీ‌ముఖి ఎక్స్ క్లూజివ్ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో మంట‌లు పెట్టింది.

By:  Tupaki Desk   |   19 Aug 2024 4:03 AM GMT
థై స్లిట్ ఫ్రాక్‌లో యాంకర్ శ్రీ‌ముఖి
X

షోబిజ్‌లోని ప్రముఖ యాంకర్ కం నటీమణిగా శ్రీముఖి క్రేజ్ వేరు. అత్యుత్తమ యాంక‌ర్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్ధం పైగానే కొన‌సాగిన శ్రీ‌ముఖి పెద్ద తెర‌పైనా రాణిస్తున్నారు. త‌న‌దైన నటప్ర‌తిభ‌తో పాటు ఇండ‌స్ట్రీలో రేర్ ఫ్యాష‌నిస్టాగాను గుర్తింపును పొందింది. టాప్ యాంక‌ర్ శ్రీ‌ముఖి సోషల్ మీడియాల్లోను చాలా యాక్టివ్‌గా ఉంటుంది. త‌న‌ అభిమానులతో సన్నిహితంగా ఉండటానికి ఎప్ప‌టిక‌ప్పుడు తాజా విహారయాత్రల నుండి ఫోటోలను తరచుగా షేర్ చేస్తుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి బాలాజీ ఆలయాన్ని సందర్శించి, తన విహారయాత్ర నుండి ఫోటోలను షేర్ చేయ‌గా అవి క్ష‌ణాల్లో వైర‌ల్ అయ్యాయి. మొన్న‌టికి మొన్న త‌న షూటింగ్ లొకేష‌న్ లో కార‌వ్యాన్ నుంచి శ్రీ‌ముఖి ఎక్స్ క్లూజివ్ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో మంట‌లు పెట్టింది.

ఇంత‌లోనే ఇప్పుడు ఒక స్పెష‌ల్ ఫోటోగ్రాఫ్ నెట్ లో అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షించింది. ఇది ఇటీవ‌లి కాలంలో డీసెంట్ అండ్ స్పెష‌ల్ లుక్. శ్రీ‌ముఖి థై స్లిట్ ఫ్రాకులో సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపించింది. అస‌భ్య‌త‌కు తావివ్వ‌కుండా ఈ ఫోటోషూట్ లో శ్రీ‌ముఖి అభిన‌యించిన తీరు ఆక‌ర్షించింది. బంగారు వ‌ర్ణం ఫ్రాకు ధ‌రించి ఆ పైన బ్లేజ‌ర్ తో అందాల‌ను క‌వ‌ర్ చేసింది. ఇక శ్రీ‌ముఖి థిక్ మేక‌ప్ లుక్ లో క‌నిపించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.

శ్రీముఖి టెలివిజన్ హోస్ట్‌గా తన కెరీర్‌ని ప్రారంభించింది. జులాయి (2012)లో సహాయ పాత్రతో తన సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్ (2013)లో కీలక పాత్రను పోషించింది. తెలుగు బుల్లితెరపై అత్యధిక పారితోషికం తీసుకునే యాంక‌ర్ల‌లో శ్రీముఖి ఒకరు. చివరిగా మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో `భోలా శంకర్` చిత్రంలో శ్రీ‌ముఖి కనిపించింది. త‌దుప‌రి కొన్ని సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. మ‌రోవైపు టీవీ కార్య‌క్ర‌మాల‌తోనూ కెరీర్ ప‌రంగా దూసుకెళుతున్న ఈ బ్యూటీ బాగానే ఆర్జిస్తోంది.