Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : లంగా ఓనిలో అందాల రాములమ్మ

దాదాపు దశాబ్ద కాలంగా బుల్లితెరపై తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్న శ్రీముఖి సోషల్‌ మీడియా ద్వారా కూడా రెగ్యులర్‌ గా సందడి చేస్తూ ఉంటుంది.

By:  Tupaki Desk   |   14 July 2024 1:30 PM GMT
పిక్ టాక్ : లంగా ఓనిలో అందాల రాములమ్మ
X

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు యాంకర్‌ అనగానే గుర్తుకు వచ్చే పేర్లలో శ్రీముఖి పేరు ముందు వరుసలో ఉంటుంది అనడంలో సందేహం లేదు. దాదాపు దశాబ్ద కాలంగా బుల్లితెరపై తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్న శ్రీముఖి సోషల్‌ మీడియా ద్వారా కూడా రెగ్యులర్‌ గా సందడి చేస్తూ ఉంటుంది.


రాములమ్మ అంటూ అభిమానులతో పిలిపించుకుంటున్న శ్రీముఖి హీరోయిన్‌ రేంజ్ పాపులారిటీని సోషల్‌ మీడియాలో కలిగి ఉంది అనడంలో సందేహం లేదు. హీరోయిన్ గా కూడా గతంలో నటించిన శ్రీముఖి ఇప్పుడు పూర్తిగా బుల్లి తెరపై మాత్రమే దృష్టి పెట్టింది.


తాజాగా లంగా ఓనీ లో ఈ అమ్మడు కలర్‌ ఫుల్‌ గా కన్నుల విందు చేసింది. రెగ్యులర్ గా మోడ్రన్‌ డ్రెస్ ల్లో, స్కిన్‌ షో చేస్తూ కనిపించే శ్రీముఖి ఇలా లంగా ఓని లో కనిపించడం తో చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో రాములమ్మ లంగా ఓనీ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.


ఇన్‌స్టాగ్రామ్‌ లో దాదాపుగా అయిదు మిలియన్‌ ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్న శ్రీముఖి ఏ ఫోటో షేర్ చేసినా కూడా నిమిషాల వ్యవధిలో లక్షల లైక్స్ మరియు షేర్స్ వస్తూ ఉంటాయి. ఈ ఫోటోలను కూడా నెటిజన్స్ తెగ లైక్ చేస్తూ షేర్‌ చేస్తున్నారు.


ఆకట్టుకునే అందంతో పాటు శ్రీముఖి మంచి ఫిజిక్‌ ఆమెకి మరింతగా ఫాలోయింగ్‌ ను కట్టబెడుతుంది అనడంలో సందేహం లేదు. ఇంతకు ముందు కాస్త బొద్దుగా ఉన్న శ్రీముఖి ఈ మధ్య కాలంలో బరువు తగ్గి మరింత అందంగా అయ్యిందంటూ ఫ్యాన్స్ మరియు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.