Begin typing your search above and press return to search.

ఆ సీక్వెల్ ఆగిపోవడం వెనక రీజన్ అదేనా..?

ఒకప్పుడు తీసిన సినిమాలకు ఇప్పుడు సీక్వెల్ చేస్తూ ఒక ట్రెండ్ కొనసాగుతుంది. అందులో భాగంగానే చాలా సినిమాలు వచ్చాయి వస్తున్నాయి

By:  Tupaki Desk   |   5 Oct 2024 1:49 PM GMT
ఆ సీక్వెల్ ఆగిపోవడం వెనక రీజన్ అదేనా..?
X

ఒకప్పుడు తీసిన సినిమాలకు ఇప్పుడు సీక్వెల్ చేస్తూ ఒక ట్రెండ్ కొనసాగుతుంది. అందులో భాగంగానే చాలా సినిమాలు వచ్చాయి వస్తున్నాయి. ఐతే ఆ దారిలోనే 2007 లో వచ్చిన ఢీ సినిమాకు సీక్వెల్ ప్రకటించారు శ్రీను వైట్ల అండ్ మంచు విష్ణు. ఇద్దరికి సూపర్ హిట్ సినిమా చాలా అవసరం. ఐతే అదేదో హిట్ సినిమా సీక్వెల్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. శ్రీను వైట్ల డైరెక్షన్, కామెడీ ఢీ సినిమాలో అదిరిపోతాయి.

మంచు విష్ణు కెరీర్ లో బెస్ట్ హిట్ సినిమాగా నిలిచిన ఢీ సీక్వెల్ ప్లాన్ చేశారు. డీ ఎట్ ఢీ అంటూ ఒక సినిమా ప్రకటన కూడా చేశారు. కానీ అనుకోకుండా ఆ సినిమా ప్రయత్నాలు ఆపేశారు. సీక్వెల్ సినిమా ఆగిపోవడానికి కారణాలు ఏంటన్నది తెలియలేదు. ఐతే ఆ విషయంపై లేటెస్ట్ గా స్పందించారు దర్శకుడు శ్రీను వైట్ల. ఆయన చేసిన విశ్వం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్రీను వైట్ల తన సినిమాలకు సంబందించిన ఇంట్రెస్టింగ్ విషయాలను చెబుతూ వచ్చారు.

అందులో భాగంగానే ఢీ సీక్వెల్ ఆగిపోవడానికి కారణం కూడా వెల్లడించారు. ఢీ సినిమాలో శ్రీహరి పాత్ర చాలా స్పెషల్ అని.. సీరియస్ గా ఉంటూనే ఆయన ఆడియన్స్ ను నవ్వించారు. ఐతే ఢీ సీక్వెల్ లో కూడా ఆయన ఉంటే బాగుండేదనిపించింది. ఆయన పాత్రను రీప్లేస్ చేసే యాక్టర్ దొరకలేదు. ఒకరిద్దరి పేర్లు అనుకున్నా ఎందుకో సెట్ అవ్వదని అనిపించింది. అందుకే ఆ ప్రయత్నాలు ఆపేశామని అన్నారు శ్రీను వైట్ల.

ఢీ సీక్వెల్ చేసి ఉంటే బాగుండేదని ఆడియన్స్ అనుకుంటున్నారు. శ్రీహరి పాత్రకు మరో నటుడు కుదరకనే ఢీ 2 ఆగిపోయిందని శ్రీను వైట్ల చెప్పారు. అంతేకాదు ఆగడు సినిమా కథ వేరే అయితే కొన్ని కారణాల వల్ల వేరే కథ చేయాల్సి వచ్చిందని అన్నారు. ఐతే ఈమధ్య అసలేమాత్రం ఫాం లో లేని శ్రీను వైట్ల తిరిగి విశ్వంతో సక్సెస్ ఫాంలోకి రావాలని చూస్తున్నారు. మరి అనుకున్న విధంగా జరుగుతుందా లేదా అన్నది చూడాలి. మ్యాచో హీరో గోపీచంద్ మాత్రం ఈసారి విశ్వంతో సూపర్ హిట్ కొట్టాలని కసి మీద ఉన్నాడు.