Begin typing your search above and press return to search.

ఆ డైరెక్టర్ అప్డేట్ అవ్వకపోతే కష్టమేనా..?

ఏదేమైనా డైరెక్టర్ శ్రీను వైట్ల ఇప్పటి నుంచైనా అప్డేట్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   14 Oct 2024 4:09 PM GMT
ఆ డైరెక్టర్ అప్డేట్ అవ్వకపోతే కష్టమేనా..?
X

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా రాణించారు శ్రీను వైట్ల. ఓవైపు మాస్, మరోవైపు క్లాస్ ను ఆకట్టుకునే యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌ లను తెరకెక్కించడంలో ఆయనకు సాటిలేరు అనిపించుకున్నారు. దాదాపు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో వర్క్ చేసి, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. అయితే గత కొంతకాలంగా దర్శకుడి కెరీర్ సాఫీగా సాగడం లేదు. స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చేస్తున్న ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారుతోంది. లేటెస్టుగా వచ్చిన 'విశ్వం' చిత్రానికి కూడా ఆడియన్స్ నుంచి అనానిమస్ పాజిటివ్ టాక్ రాలేదు.

గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన సినిమా "విశ్వం". దసరా సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. దర్శకుడు తన గత సినిమాల ఫార్మాట్ లోనే కామెడీ ప్లస్ యాక్షన్ మిక్స్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే కథలో కొత్తదనం లేదని, తన పాత చిత్రాల సన్నివేశాలు, పాత్రలనే రిపీట్ చేశారని విమర్శలు వచ్చాయి. ఆడియన్స్ తన నుంచి కామెడీ ఆశిస్తున్నప్పటికీ, ఫ్రెష్ కంటెంట్ తో వస్తేనే వారికి కొత్త అనుభూతి కలుగుతుంది.. అప్పుడే ఆదరణ లభిస్తుంది.

'నీకోసం' మినహాయిస్తే, శ్రీను వైట్ల మిగతా సినిమాలన్నిటిలో కామెడీ హైలైట్ గా ఉంటుంది. తనకు కలిసొచ్చిన కామెడీతోనే ఆనందం, సొంతం, వెంకీ, ఢీ, రెడీ, దుబాయ్ శీను, కింగ్, దూకుడు, నమో వెంకటేశ, బాద్ షా వంటి హిట్లు కొట్టాడు. ఓకే ఫార్మాట్ లో ఉన్నప్పటికీ ప్రతీ దాంట్లో కొత్త కథను చెప్పడానికే ప్రయత్నించారు. కానీ రాను రాను ఒకే తరహా సినిమాలు బోర్ కొట్టడంతో 'ఆగడు' చిత్రాన్ని ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. 'బ్రూస్ లీ' 'మిస్టర్' 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో.. దర్శకుడి కెరీర్ లో గ్యాప్ వచ్చింది.

ఈ నేపథ్యంలో ఆరేళ్ల సమయం తీసుకొని, ఎంతో కసరత్తు చేసి 'విశ్వం' సినిమా తెరకెక్కించారు. అయితే రొమాన్స్, కామెడీ.. ఇలా ఏ అంశం కూడా పెద్దగా ఎంగేజ్ చేయలేకపోయింది. గత చిత్రాలను గుర్తు చేసినా, వాటి మాదిరిగా ఎంటర్టైన్ చేయలేకపోయింది. టాక్ ఎలా ఉన్నా ఇప్పటికైతే ఫస్ట్ డే కంటే సెకండ్ డే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయని.. సెకండ్ డే కంటే థర్డ్ డే ఎక్కువ కలెక్ట్ చేసిందని మేకర్స్ చెబుతున్నారు. మరి ఇది ఎంతవరకూ వసూలు చేయగలుగుతుంది.. ఫైనల్ రిజల్ట్ ఏంటనేది ఈ వారంలో తేలిపోతుంది.

ఏదేమైనా డైరెక్టర్ శ్రీను వైట్ల ఇప్పటి నుంచైనా అప్డేట్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. న్యూ ఏజ్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని సినిమాలు చెయ్యాలని.. ట్రెండ్ కు తగ్గట్టుగా క్రియేటివ్ గా కొత్తగా ఆలోచించి, ఫ్రెష్ కంటెంట్ తో రావాలని కామెంట్స్ చేస్తున్నారు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి మళ్ళీ రేసులోకి రావాలని, పూర్వవైభవాన్ని అందుకోవాలని సినీ అభిమానులు ఆశిస్తున్నారు.