Begin typing your search above and press return to search.

గోపీచంద్ మూవీలో రవితేజ ట్రైన్ సీన.. శీను వైట్ల స్కెచ్ మామూలుగా లేదుగా…

స్టార్ హీరోలతో కూడా అద్భుతమైన కామెడీ ట్రాక్ నడిపిస్తూ సినిమాలు తీయడంలో డైరెక్టర్ శీను వైట్ల సిద్ధహస్తుడు.

By:  Tupaki Desk   |   31 July 2024 9:25 AM GMT
గోపీచంద్ మూవీలో రవితేజ ట్రైన్ సీన.. శీను వైట్ల  స్కెచ్ మామూలుగా లేదుగా…
X

స్టార్ హీరోలతో కూడా అద్భుతమైన కామెడీ ట్రాక్ నడిపిస్తూ సినిమాలు తీయడంలో డైరెక్టర్ శీను వైట్ల సిద్ధహస్తుడు. అతను తీసే సినిమాలలో కంటెంట్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో కామెడీ యాంగిల్ అంతకుమించి ఉంటుంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో నటించిన దూకుడు చిత్రంలో ఒకపక్క కథ సిరియాసిటీని మెయింటైన్ చేస్తూ మరో పక్క బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణలతో అతను చేయించిన కామెడీ ఓ రేంజ్ లో ఉంటుంది.

ఇక ఈ మూవీలో మహేష్ బాబు తన కామెడీ టైమింగ్ తో కడుపుబ్బ నవ్విస్తాడు. ఎక్కడ బోర్ కొట్టకుండా ఆద్యంతంగా నవ్విస్తూ, యాక్షన్ తో మైమరపిస్తూ ముందుకు సాగుతుంది ఈ చిత్రం. అలాగే శీను వైట్ల తెరకెక్కిచ్చిన రవితేజ వెంకీ మూవీ లో ట్రైన్ ఎపిసోడ్ సంగతి అయితే చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఎందరో మీమర్స్ కి ఈ పర్టికులర్ ఎపిసోడ్ చాలా ఫేవరెట్. 45 నిమిషాల పాటు సాగే ఈ సుదీర్ఘమైన ట్రైన్ ట్రాక్.. ఆ మూవీ బ్లాక్ బస్టర్ కావడంలో ఎంతో కీలక పాత్ర పోషించింది.

చాలా లాంగ్ గ్యాప్ తర్వాత తిరిగి వెంకీ స్టైల్ వింటేజ్ రైల్ సీను ను శీను వైట్ల గోపీచంద్ నటిస్తున్న విశ్వం చిత్రంలో వాడారు. గోపీచంద్ హీరోగా శీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ త్వరలో విడుదలకు సిద్ధం కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించిన ఒక చిన్న మేకింగ్ వీడియో ని విడుదల చేశారు. ఇక ఇందులో ఉన్న ట్రైన్ సన్నివేశం అందరినీ ఆకట్టుకోవడంతో పాటు ఒకప్పటి వెంకీ మూవీ సీక్వెన్స్ ని గుర్తు చేస్తోంది.

ఇక విశ్వం చిత్రంలో హీరో హీరోయిన్ తో పాటుగా, నరేష్, ప్రగతి, వెన్నెల కిషోర్,అజయ్ ఘోష్, చమ్మక్ చంద్ర లాంటి పెద్ద క్యాస్టింగ్ ను ఈ ట్రైన్ సన్నివేశానికి తీసుకోవడం మరొక విశేషం. విజువల్స్ చూస్తుంటే ఈ సీన్ పూర్తి ఫన్ మోడ్ లో నడుస్తుందని అర్థమవుతుంది. శీను వైట్ల గత కొద్ది కాలంగా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు.. ఇటు గోపీచంద్ కూడా మంచి బ్రేక్ కోసం ట్రై చేస్తున్నాడు. ఈ ఇద్దరికీ ఈ మూవీ సక్సెస్ అవ్వడం ఎంతో ఇంపార్టెంట్. ఈ చిత్రం సెప్టెంబర్ లో థియేటర్లలో విడుదల చేసే అవకాశం ఉంది. శీను వైట్ల ట్రేడ్ మార్క్ కామెడీ క్లిక్ అయిందా.. ఈ మూవీ క్లీన్ హిట్ అవడం కన్ఫామ్.