అలా గట్టిగా ఫిక్సయ్యే ఈ సినిమా చేశా..!
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు.
By: Tupaki Desk | 23 March 2024 1:20 PM GMTశ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి నటించిన సినిమా ఓం భీం బుష్. ప్రీతి, అయేషా ఖాన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాను హర్ష డైరెక్ట్ చేశారు. శుక్రవారం రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా సక్సెస్ అయిన సందర్భంగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు.
ఓం భీం బుష్ సక్సెస్ మీట్ లో శ్రీ విష్ణు ఎనర్జిటిక్ స్పీచ్ తో అలరించారు. కొత్త పాయింట్ తో తెరకెక్కించిన ఈ సినిమా కచ్చితంగా ఆడియన్స్ ను అలరిస్తుందని గట్టిగా ఫిక్స్ అయ్యే సినిమా చేశానని అన్నారు. ఓం భీం బుష్ కి వస్తున్న రెస్పాన్స్ గురించి చెప్పిన శ్రీ విష్ణు సినిమా ప్రేక్షకుల ఆదరణతో దూసుకెళ్తుందని అన్నారు. అంతేకాదు ఈ సినిమా చాలా రోజులు ఆడుతుందని అన్నారు.
సినిమా సక్సెస్ లో మీడియా పాత్ర గురించి చెప్పిన శ్రీ విష్ణు సినిమాకు మంచి రివ్యూస్ ఇచ్చారు. రేటింగ్ కూడా బాగా ఇచ్చారని అన్నారు. డైరెక్టర్ హర్ష ఫస్ట్ టైం కథ చెప్పినప్పుడు ఇలాంటి కొత్త పాయింట్ చెప్పాలంటే చాలా నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం హర్ష లో కనిపించింది. కథ చెప్పినప్పుడు దానితో పాటు కలిసి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇంకాస్త ధైర్యం వచ్చిందని అన్నారు శ్రీ విష్ణు. కథలు చెప్పే సినిమాలు వేరే ఉంటాయి. కానీ కొన్ని గొప్ప పాయింట్లు గురించి డిస్కస్ చేయాలంటే చాలా అరుదుగా దొరుకుతాయి. అవి దొరికినప్పుడు దాని చుట్టూ ఎంటర్టైన్మెంట్ అల్లి థియేటర్ లో నవ్విద్దాం అని గట్టిగా ఫిక్స్ ఈ సినిమా చేశామని అన్నారు శ్రీ విష్ణు.
సినిమా కోసం డైరెక్టర్ హర్ష కొన్నిసార్లు 20, 30 టేకులు చేయించుకున్నా అతని స్టైల్ అది. అందుకే ఈరోజు సినిమా సక్సెస్ అయ్యింది. సినిమా కోసం మాకు మంచి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. ఇంకా ఫ్యూచర్ లో ఇంకా మంచి మంచి పాయింట్లతో సినిమాలు చేయాలని కోరుతున్నానని అన్నారు శ్రీ విష్ణు. తెలుగులో అంత డిఫరెంట్ పాయింట్స్ యాక్సెప్ట్ చేసే వాళ్లు ఎంతమంది ఉన్నారో తనకు తెలియదని కానీ హర్ష ఏ భాషలో సినిమా చేసినా సక్సెస్ అవుతాడని అన్నారు. కథ చెప్పిన తర్వాత తనతో పాటు రాహుల్, దర్శిలను కన్విన్స్ చేసి తీసుకొచ్చినప్పుడే సినిమా సక్సెస్ అని ఫిక్స్ అయ్యానని అన్నారు శ్రీ విష్ణు. ఇక సినిమా కోసం పనిచేసిన టెక్నిషియన్ టీం అందరి గురించి ప్రస్తావించారు. అందరి సహకారంతోనే సినిమా ఇలా వచ్చిందని.. ఈ సినిమా ఇంకా చాలా దూరం వెళ్తుందని.. చాలా రోజులు థియేటర్ లో ఆడుతుందని అన్నారు శ్రీ విష్ణు.