Begin typing your search above and press return to search.

శ్రీవిష్ణు స్వాగ్.. ఇక అప్డేట్లే అప్డేట్లు!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 May 2024 7:49 AM GMT
శ్రీవిష్ణు స్వాగ్.. ఇక అప్డేట్లే అప్డేట్లు!
X

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. గత ఏడాది సామజవరగమనలో సూపర్ సక్సెస్ అందుకున్నారు. అంతకుముందు కొన్ని ఫ్లాపులు చవిచూసిన శ్రీవిష్ణుకు ఆ సినిమా భారీ ఊపునిచ్చింది. ఇక 2024లో ఓం భీమ్ బుష్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. తన యాక్టింగ్, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.


ఇప్పుడు రెండు సినిమాల్లో నటిస్తున్నారు శ్రీవిష్ణు. అందులో ఒకటైన స్వాగ్ మూవీ కోసం తనకు ఇప్పటికే రాజ రాజ చోళతో సూపర్ హిట్ ఇచ్చిన హసిత్ గోలితో వర్క్ చేస్తున్నారు. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. హిట్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన టైటిల్ అనౌన్స్మెంట్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియన్స్ ను ఫుల్ నవ్వించింది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు శ్రీవిష్ణు. "చూస్తూ ఉండండి! SWAG నుంచి సరికొత్త అప్టేట్స్ మీ ముందుకు వస్తున్నాయి" అని ట్వీట్ చేశారు. షూటింగ్ పిక్ ను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం శ్రీవిష్ణు పోస్ట్ వైరల్ గా మారగా.. సినిమా కోసం వెయిటింగ్ అన్న అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. త్వరలోనే ఈ మూవీ నుంచి మేకర్స్.. సాంగ్ లేదా టీజర్ ను రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన రీతూ వర్మ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. ఇటీవల ఆమె పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ లో రీతూ రాణిగా, మెడలో బంగారు ఆభరణాలతో కనిపించింది. వింజామర వంశ మహారాణి రుక్మిణీ దేవి రోల్ లో ఆమె నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. పెళ్లి చూపులు వంటి పలు సినిమాలతో క్రేజ్ సంపాదించుకున్న రీతూ.. ఈ మూవీలో మంచి స్కోప్ ఉన్న రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక స్వాగ్ మూవీ.. రాజ రాజ చోళకు ప్రీక్వెల్‌ గా రూపొందతోందని సినీ వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి. హీరో దొంగతనాలను చూపిస్తూ కామెడీతో పాటు మంచి ఎమోషన్స్ కూడా మిక్స్ చేసిన రాజ రాజ చోళ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు స్వాగ్ మూవీ.. అసలు శ్రీవిష్ణు దొంగ ఎలా అయ్యాడు? ఎలాంటి పరిస్థితుల్లో తన జీవితం మారింది? అనే కాన్సెప్ట్ తో రానున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి