Begin typing your search above and press return to search.

ప్రభాస్ మొదటి సినిమా హీరోయిన్.. మళ్ళీ ఇన్నాళ్లకు..

అతి తక్కువ మంది మాత్రమే 35 ఏళ్ళ తర్వాత కూడా స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతారు.

By:  Tupaki Desk   |   26 Aug 2024 10:40 AM GMT
ప్రభాస్ మొదటి సినిమా హీరోయిన్.. మళ్ళీ ఇన్నాళ్లకు..
X

సౌత్ ఇండియాలో హీరోయిన్స్ ఏజ్ ఫ్యాక్టర్ 30 నుంచి 35 ఏళ్ళ మధ్యలోనే ఉంటుంది. మేగ్జిమమ్ చాలా మంది హీరోయిన్స్ 35 ఏళ్ళకి సీనియర్ జాబితాలో చేరిపోతారు. అవకాశాలు కూడా క్రమంగా తగ్గిపోతాయి. అయితే ఫీమేల్ సెంట్రిక్ కథలు, లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మూవీస్ ని వారు చేసుకోవాల్సి ఉంటుంది. అతి తక్కువ మంది మాత్రమే 35 ఏళ్ళ తర్వాత కూడా స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతారు.

అలాంటి జాబితాలో నయనతార, త్రిష లాంటి కథానాయకిలు కనిపిస్తున్నారు. తమన్నా, కాజల్ అగర్వాల్, సమంత లాంటి స్టార్ హీరోయిన్స్ కు గతంలో మాదిరిగా అవకాశాలు అయితే రావడం లేదు . ఇప్పుడు స్టార్ హీరోలు అందరూ యంగ్ బ్యూటీస్ కోసం చూస్తున్నారు. సీనియర్ హీరోయిన్స్ గా మారిపోయిన వారు సౌత్ లో కూడా చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ లాంటి సీనియర్ స్టార్స్ కి జోడీగా నటిస్తున్నారు.

అయితే 2011లోనే హీరోయిన్ గా ఫేడ్ అవుట్ అయిపోయిన ఒక బ్యూటీ 13 ఏళ్ళ తర్వాత మరల హీరోయిన్ గా ఒక సినిమాలో నటించే ఛాన్స్ అందుకుంది. నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన సుందరకాండ మూవీలో సీనియర్ బ్యూటీ శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో 2002లో కెరియర్ స్టార్ట్ చేసిన శ్రీదేవి విజయ్ కుమార్ ఆశించిన స్థాయిలో సక్సెస్ లు అందుకోలేకపోయింది.

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళీ భాషలలో హీరోయిన్ గా మూవీస్ చేసింది. అయితే ఆమెకి ఆశించిన స్థాయిలో కమర్షియల్ హీరోయిన్ ఇమేజ్ రాలేదు. తెలుగులో 2011లో వీర సినిమాలో రవితేజ చెల్లెలుగా నటించింది. చివరిగా 2016లో కన్నడంలో లక్ష్మణ అనే సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించింది. ఆ తరువాత వెండితెరపై మరల కనిపించలేదు. అయితే 2022 నుంచి టెలివిజన్ షోలకి జడ్జ్ గా శ్రీదేవి విజయ్ కుమార్ వస్తోంది. టీవీ రియాలిటీషోలలో జడ్జ్ గా ఉంటున్న శ్రీదేవి విజయ్ కుమార్ తన అందంతో ఆకట్టుకుంటోంది.

అయితే అనూహ్యంగా నారా రోహిత్ సుందరకాండ సినిమాలో అతనికి జోడీగా నటించే ఛాన్స్ ని శ్రీదేవి విజయ్ కుమార్ అందుకుంది. ఈ మూవీ కాన్సెప్ట్ ప్రకారం వయస్సు పెరిగిన పెళ్లికాని వాడిగా నారా రోహిత్ పాత్ర ఉంటుంది. అతని క్యారెక్టర్ కి సరిపోయే వయస్సుతో హీరోయిన్ ఉండాలని శ్రీదేవి విజయ్ కుమార్ ని ఎంపిక చేసారంట. తాజాగా మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. టీజర్ రిలీజ్ సందర్భంగా జరిగిన మీడియా మీట్ లో శ్రీదేవి విజయ్ కుమార్ పాల్గొంది. సుందరకాండ మూవీ కమర్షియల్ సక్సెస్ అయితే మాత్రం శ్రీదేవి విజయ్ కుమార్ మరల నటిగా బిజీ అయ్యే అవకాశం ఉందనే మాట ఇప్పుడు వినిపిస్తూంది.