Begin typing your search above and press return to search.

ఆ ఎక్స్ పీరియన్స్ తర్వాతే పెళ్లి.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

కెరీర్ లో ఒక సాలిడ్ హిట్ కొట్టిన తర్వాతే తను పెళ్లి చేసుకుంటానని. అప్పటివరకు చేసుకోనని అంటుంది శ్రీ దివ్య. అంటే హిట్ ఎక్స్ పీరియన్స్ కొట్టిన తర్వాతే మెడలో తాళి కట్టించుకుంటానని గట్టిగా ఫిక్స్ అయ్యింది.

By:  Tupaki Desk   |   31 Jan 2024 11:30 PM
ఆ ఎక్స్ పీరియన్స్ తర్వాతే పెళ్లి.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!
X

అదేంటో కన్నడ, చెన్నై భామలకు తెలుగులో ఎలా ఐతే క్రేజ్ ఏర్పడుతుందో తెలుగు అమ్మాయిలకు అలా చెన్నైలో మంచి ఫాలోయింగ్ ఏర్పడుతుంది. అంతకుముందు చాలామంది తెలుగు అమ్మాయిలు ఇలానే తమిళంలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. అంతకుముందు కలర్స్ స్వాతి కూడా తమిళంలో సత్తా చాటింది. ఆ తర్వాత తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి మెప్పించిన శ్రీదివ్య మనసారా సినిమాతో హీరోయిన్ గా తెలుగు ఆడియన్స్ ని మెప్పించింది. ఆ తర్వాత బస్ స్టాప్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.


ఆ క్రేజ్ తో తమిళంలో వారుతాపడతా వాలిబర్ సంగం సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో శ్రీ దివ్య కోలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంది. 2023 లో వచ్చిన వారుతా పడతా వాలిబర్ సంగం సినిమా నుంచి ఏడాదికి ఒకటి రెండు చూపున ఈ పదేళ్లు తమిళంలోనే హీరోయిన్ గా రాణిస్తూ వచ్చింది శ్రీ దివ్య. అక్కడ యువ హీరోల సినిమాల్లో నటిస్తూ సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది

అయితే ఈమధ్య అమ్మడు కొద్దిగా ఫాం కోల్పోయినట్టు అనిపించగా శ్రీ దివ్య పెళ్లికి రెడీ అయ్యిందని కోలీవుడ్ మీడియా హడావిడి చేసింది. కెరీర్ లో కాస్త వెనకపడ్డ ప్రతి హీరోయిన్ గురించి మీడియా రాసే వార్తలు అవే కాబట్టి శ్రీ దివ్య పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈసారి మళ్లీ శ్రీ దివ్య పెళ్లి గురించి మీడియాలో హడావిడి మొదలైంది. తన పెళ్లిపై వస్తున్న వార్తలకు స్పందించింది శ్రీ దివ్య.

కెరీర్ లో ఒక సాలిడ్ హిట్ కొట్టిన తర్వాతే తను పెళ్లి చేసుకుంటానని. అప్పటివరకు చేసుకోనని అంటుంది శ్రీ దివ్య. అంటే హిట్ ఎక్స్ పీరియన్స్ కొట్టిన తర్వాతే మెడలో తాళి కట్టించుకుంటానని గట్టిగా ఫిక్స్ అయ్యింది. హీరోయిన్ గా తిరిగి కం బ్యాక్ ఇవ్వాలని కసితో ఉన్న శ్రీ దివ్యకు అడపాదడపా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. మరి రాబోయే సినిమాలతో అయినా శ్రీ దివ్య కోరుకునే హిట్ వస్తుందా లేదా అన్నది చూడాలి.

తమిళంలో రాణిస్తున్న శ్రీ దివ్యకు మధ్యలో తెలుగు ఆఫర్లు ఒకటి రెండు పలుకరించాయని వార్తలు వచ్చినా అవి ఎందుకో వర్క్ అవుట్ కాలేదు. అందుకే తనకు ఈ క్రేజ్ ఇచ్చిన కోలీవుడ్ లోనే వరుస సినిమాలు చేస్తూ వచ్చింది శ్రీ దివ్య. మధ్యలో మలయాళంలో కూడా ఒక సినిమా చేసిన అమ్మడు అక్కడ కెరీర్ కొనసాగించాలని చూసింది. ప్రస్తుతం తమిళంలో ఒక సినిమా చేస్తున్న శ్రీ దివ్య తిరిగి ఫాంలోకి రావాలని చూస్తుంది.