Begin typing your search above and press return to search.

సెలెక్టివ్.. క్రియేటివ్.. కాలిక్యులేటివ్.. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ట్రైలర్ టాక్..!

అదే సినిమా లీడ్ రోల్ లోనె వెన్నెల కిశోర్ చేస్తున్నాడు అంటే కచ్చితంగా ఎంటర్టైన్ మెంట్ డబుల్ ఉంటుందని అర్ధం చేసుకోవచ్చు.

By:  Tupaki Desk   |   16 Dec 2024 1:57 PM GMT
సెలెక్టివ్.. క్రియేటివ్.. కాలిక్యులేటివ్.. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ట్రైలర్ టాక్..!
X

కమెడియన్ గా తన మార్క్ చాటుతూనే సోలోగా సెలెక్టెడ్ సినిమాలు చేస్తున్నాడు స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్. సినిమాలో వెన్నెల కిశోర్ ఉన్నాడు అంటేనే కామెడీ అదిరిపోతుందని అనుకుంటారు. అదే సినిమా లీడ్ రోల్ లోనె వెన్నెల కిశోర్ చేస్తున్నాడు అంటే కచ్చితంగా ఎంటర్టైన్ మెంట్ డబుల్ ఉంటుందని అర్ధం చేసుకోవచ్చు. రిజల్ట్ తో పని లేకుండా తన దాకా వచ్చిన ఇంట్రెస్టింగ్ కథలతో సోలోగా చేస్తూ మెప్పిస్తున్న వెన్నెల కిశోర్ లేటెస్ట్ గా చేస్తున్న సినిమా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్.

మామూలుగా డిటెక్టివ్, మిస్టీరియస్ థ్రిల్లర్ కథలకు షెర్లాక్ హోమ్స్ తో పోల్చుతూ మన వాళ్లు సినిమాలు తీస్తుంటారు. కానీ వెన్నెల కిశోర్ లీడ్ రోల్ లో వస్తున్న ఈ సినిమాకు ఏకంగా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే టైటిల్ పెట్టారు. రైటర్ మోహన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనన్యా నాగళ్ల, శియా గౌతం, రవితేజ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. డిసెంబర్ 25న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. ఊరిలో జరుగుతున్న వరుస హత్యలను చేధించడంలో పోలీసులు చేతులు ఎత్తేస్తే శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ గా పేరున్న డిటెక్టివ్ ని రంగంలోకి దించుతారు. ఇంతకీ ఆ డిటెక్టివ్ వచ్చి ఆ హత్యలు చేస్తున్నది ఎవరన్నది కనిపెట్టాడా లేదా అన్నది ఈ సినిమా కథ. ట్రైలర్ అయితే ఆద్యంతం ఆసక్తికరంగా ఆహ్లాదకరంగా ఉంది. సినిమా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేలా ఉంది.

ఈ సినిమాను శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్ లో వెన్నపూస రమణా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సునీల్ కశ్యప్, గ్యాని మ్యూజిక్ అందిస్తున్నారు. డిసెంబ 25న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ తో ఆడియన్స్ లో బజ్ క్రియేట్ చేయగా సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో మొత్తం పూర్తిగా నడిపించే కథనం ఒక టైప్ అయితే దానికి కామెడీ జోడించి సినిమా నడిపించడం రెండో టైప్ మరి రైటర్ మోహన్ తాను ఎంచుకున్న కథ కథనాలకు ఎంతవరకు న్యాయం చేశారన్నది రిలీజ్ అయ్యాక తెలుస్తుంది.