Begin typing your search above and press return to search.

వెన్నెల కిషోర్ మరో క్రేజీ మూవీ

అయితే శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్ మూవీ మూడు పాత్ర‌ల నేప‌థ్యంలో సాగుతుంద‌ని ద‌ర్శ‌కుడు రైట‌ర్ మోహ‌న్ కొన్ని రోజుల క్రితం చెప్పారు.

By:  Tupaki Desk   |   30 May 2024 10:16 AM GMT
వెన్నెల కిషోర్ మరో క్రేజీ మూవీ
X

టాలీవుడ్ టాప్ క‌మెడియ‌న్ వెన్నెల కిషోర్ హీరోగా శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్ పేరుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్రైమ్ కామెడీ థ్రిల్ల‌ర్‌ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీకి రైట‌ర్ మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాతోనే ద‌ర్శ‌కుడిగా ఆయన తెలుగు ఇండస్ట్రీలోకి డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నారు. బ్యూటిఫుల్ అన‌న్య నాగ‌ళ్ల హీరోయిన్‌గా న‌టిస్తోంది.

అయితే శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్ మూవీ మూడు పాత్ర‌ల నేప‌థ్యంలో సాగుతుంద‌ని ద‌ర్శ‌కుడు రైట‌ర్ మోహ‌న్ కొన్ని రోజుల క్రితం చెప్పారు. షెర్ అంటే ష‌ర్మిల‌మ్మ‌.. లోక్ అంటే లోక్‌నాథం.. హోమ్ అంటే ఓం ప్ర‌కాష్‌.. ఈ మూడు పాత్ర‌ల చుట్టే మూవీ సాగుతుంద‌ని తెలిపారు. రెట్రో బ్యాక్‌ డ్రాప్‌ లో ఫ‌న్నీ మిస్టరీ థ్రిల్ల‌ర్‌ గా ఈ మూవీని రూపొందిస్తున్న‌ట్లు వెల్లడించారు. దీంతో మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ అందుకుంది. తాజాగా మేకర్స్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. కథలు పెతలాయే.. కథనాలు ఏడాయే.. మొన్న సచ్చిన కుందేలు.. నిన్న కూరాయే.. దాన్ని సంపినోడు సచ్చి.. ఆరు నెళ్లాయే.. ఈ చిక్కుముడి విప్పినోడు.. హా విప్పినోడు సికాకుళం షెర్లాక్ హోమ్స్ ఆయే.. అంటూ బ్యాక్ గ్రౌండ్ లో రాజీవ్ కనకాల వాయిస్ తో వస్తున్న డైలాగ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.

మోషన్ పోస్టర్ విజువల్స్ రెట్రో బ్యాక్ డ్రాప్ లో బాగున్నాయి. లేటెస్ట్ అప్డేట్.. మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఓవరాల్ గా మోషన్ పోస్టర్ బాగుందని సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఈ మూవీలో వెన్నెల‌ కిషోర్ తండ్రిగా నాగ‌ మ‌హేష్ క‌నిపించ‌బోతున్నారు. శియా గౌత‌మ్‌ తో పాటు ర‌వితేజ మ‌హాదాస్యం, అనీష్ కురివిల్లా కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు. సినిమా షూటింగ్ చివరి ద‌శ‌కు చేరుకున్న‌ట్లు స‌మాచారం.

అయితే టాలీవుడ్‌ లో బిజీయెస్ట్ క‌మెడియ‌న్‌ ల‌లో ఒక‌రిగా వెన్నెల‌ కిషోర్ కొన‌సాగుతున్నారు. 2023లో 20 సినిమాల్లో నటించారు. ఈ ఏడాదిలో హనుమాన్, గుంటూరు కారం సహా పలు చిత్రాల్లో కనిపించారు. ప్ర‌స్తుతం రామ్‌ చ‌ర‌ణ్‌ గేమ్ ఛేంజ‌ర్‌ తో పాటు ప‌లు భారీ బ‌డ్జెట్ సినిమాల్లో వెన్నెల‌ కిషోర్ న‌టిస్తున్నారు. ఇండియ‌న్‌ 2తో కోలీవుడ్‌ లోకి కూడా ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. మరి అటు హీరోగా ఇటు కమెడియన్ గా వెన్నెల కిషోర్ ఎలాంటి విజయాలు అందుకుంటారో చూడాలి.