Begin typing your search above and press return to search.

రీ రిలీజ్ టైమ్ లో అతని సైలెన్స్ రీజన్ ఏంటి..?

స్టార్ సినిమాల రీ రిలీజ్ హంగామాలో భాగంగా ఫిబ్రవరి 7న విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా రీ రిలీజైన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   9 March 2025 5:13 PM IST
రీ రిలీజ్ టైమ్ లో అతని సైలెన్స్ రీజన్ ఏంటి..?
X

స్టార్ సినిమాల రీ రిలీజ్ హంగామాలో భాగంగా ఫిబ్రవరి 7న విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా రీ రిలీజైన విషయం తెలిసిందే. ఐతే ఆ సినిమా రీ రిలీజ్ థియేటర్స్ లో మహేష్ బాబు ఫ్యాన్స్ హంగామా ఒక రేంజ్ లో ఉంది. ఎస్.వి.ఎస్.సి ఒక క్లాస్ సినిమా కానీ ఆ సినిమా రీ రిలీజ్ థియేటర్ లో ఫ్యాన్స్ హంగామా చూస్తే మాస్ సినిమాకు కూడా ఈ రేంజ్ రెస్పాన్స్ రాదేమో అనేలా ఉంది. మిగతా స్టార్ సినిమాల రీ రిలీజ్ ఏమో కానీ మహేష్ సినిమా రీ రిలీజ్ అంటే చాలు ఫ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ బజ్ తెస్తున్నారు.

ఐతే స్టార్ సినిమాల రీ రిలీజ్ టైం లో ఆ సినిమా టీం మరోసారి మీడియా ముందుకు వచ్చి సినిమా గురించి మరిన్ని విషయాలు చెబుతారు. ఐతే SVSC సినిమా రీ రిలీజైనా కూడా ఆ సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఎక్కడ కనిపించలేదు. అసలు సోషల్ మీడియాలో ఆయన ఖాతా లేదు. కానీ సినిమా రీ రిలీజ్ టైం లో అయినా ప్రేక్షకుల ముందుకు వస్తాడేమో అనుకుంటే అది జరగలేదు.

SVSC రీ రిలీజ్ టైం లో ఆ సినిమా నిర్మాత దిల్ రాజే ప్రెస్ మీట్ పెట్టారు తప్ప శ్రీకాంత్ అడ్డాల ఎక్కడ కనిపించలేదు అసలు ఈ సినిమా రీ రిలీజ్ అన్న విషయం ఆయనకు తెలుసా లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఆమధ్య మురారి సినిమా రీ రిలీజ్ టైం లో కృష్ణవంశీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ప్రశ్నలన్నిటికీ ఓపికగా సమాధానం ఇచ్చారు. ఆ టైం లో ఆయన వార్తల్లో నిలిచారు.

శ్రీకాంత్ అడ్డాల పెదకాపు 1 సినిమా రిలీజ్ తర్వాత మళ్లీ కనిపించలేదు. పెదకాపు 2 కూడా తీయాలని ముందే ఫిక్స్ అయ్యి పార్ట్ 1 రిలీజ్ చేయగా ఆ సినిమా ఫెయిల్యూర్ అవ్వడంతో లైట్ తీసుకున్నారు. ఇక ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాల అసలు కనిపించలేదు. నెక్స్ట్ సినిమా ప్లాన్ ఏంటి ఏం చేయబోతున్నాడు అన్నది కూడా తెలియదు. ఎస్.వి.ఎస్.సి లాంటి క్లాసిక్ సినిమా తీసి ఆ సినిమా రీ రిలీజ్ టైం లో డైరెక్టర్ లేకపోవడం షాక్ గానే ఉంది. మరి శ్రీకాంత్ అడ్డాల ఎందుకు ఈ రీ రిలీజ్ టైం లో బయటకు రాలేదు అన్నది తెలియాల్సి ఉంది.