హిట్ సినిమాను మిస్ అయిన నాగ్
సీతమ్మ వాకిట్లో రీరిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న సందర్భంగా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల రీసెంట్ గా ఓ ఇంటర్య్వూలో పాల్గొని ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు.
By: Tupaki Desk | 13 March 2025 1:25 PM ISTఈ జెనరేషన్ లో మల్టీస్టారర్ సినిమాలు మొదలైంది సీతమ్మ వాకట్లో సిరిమల్లె చెట్టు సినిమాతోనే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో తెరకెక్కిన ఈ సినిమా 2013లో రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మొన్న మార్చి 7న ఈ సినిమాను రీరిలీజ్ చేయగా, మరోసారి ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.
సీతమ్మ వాకిట్లో రీరిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న సందర్భంగా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల రీసెంట్ గా ఓ ఇంటర్య్వూలో పాల్గొని ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. వెంకటేష్, మహేష్ అన్నదమ్ములుగా భలే ఒదిగిపోయారనుకుంటున్న ఈ సినిమా కథ ముందుగా అక్కినేని నాగార్జున కోసం అనుకున్నట్టు ఆయన తెలిపారు.
కొత్త బంగారు లోకం సినిమా రిలీజ్ తర్వాత సంక్రాంతికి ఊరెళ్తున్న టైమ్ లో ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష ఫోన్ చేసి నాగార్జున గారికి ఏదైనా కథ ఉందా అని అడిగారని, సడెన్ గా నాగ్ సర్ కు కథ అనగానే టెన్షన్ పడుతూ, చెప్తాను అని ఫోన్ పెట్టేశానని చెప్పిన శ్రీకాంత్ ఆ జర్నీలోనే నాగ్ తో ఛాన్స్ వస్తే ఎలాంటి కథ చెప్పాలని ఆలోచించారట.
ఎప్పట్నుంచో అనుకుంటున్న అన్నదమ్ముల కథ చేస్తే బావుంటుందనుకుని ఫిక్సై ఊరి నుంచి తిరిగొచ్చి నాగ్ ను కలిసి మల్టీస్టారర్ పాయింట్ ఉందని చెప్పానని, ఇద్దరు హీరోలుంటారని, ఇంకా స్టోరీ డెవలప్ చేయలేదని చెప్పారట. దానికి నాగ్ సరే చూద్దామన్నారట. తర్వాత మూడు రోజులకు మార్తాండ్ వెంకటేష్ ఫోన్ చేసి సురేష్ బాబు పిలుస్తున్నారు. వెంకీతో సినిమా అంటున్నారని రమ్మంటే వెళ్లానని శ్రీకాంత్ అన్నారు.
తాను వెళ్లినప్పుడు సురేష్ బాబుతో పాటూ వెంకటేష్ కూడా ఉన్నారని, కొత్త బంగారు లోకం సినిమా బాగా తీసినందుకు అభినందించారని శ్రీకాంత్ చెప్పారు. ఏదైనా కథ ఉంటే చెప్పు, చేద్దామన్నారని, ఇద్దరు అన్నదమ్ముల కథ అనుకుంటున్నానని లైన్ చెప్పగానే అది నచ్చి సురేష్ బాబు డెవలప్ చేయమన్నారని చెప్పారట. కానీ తాను మాత్రం రెండో సినిమా దిల్ రాజు గారికే చేయాలని చెప్పానని, దానికి వాళ్లు కూడా సరే ముందు కథ బాగా రెడీ చెయ్ అన్నారని, అలా వెంకటేష్ వల్ల సీతమ్మ వాకిట్లో సినిమా మొదలైందని శ్రీకాంత్ తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న అక్కినేని అభిమానులు నాగ్ మంచి సినిమాను మిస్ అయ్యారని ఫీలవుతున్నారు.