Begin typing your search above and press return to search.

'గేమ్‌ ఛేంజర్‌'లో సూర్య పాత్ర అతిపెద్ద సర్‌ప్రైజ్‌

తాజాగా శ్రీకాంత్‌ చేసిన వ్యాఖ్యలు ఆ నమ్మకంను మరింతగా పెంచే విధంగా ఉన్నాయి అంటూ మెగా ఫ్యాన్స్‌తో పాటు సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   14 Dec 2024 12:32 PM GMT
గేమ్‌ ఛేంజర్‌లో సూర్య పాత్ర అతిపెద్ద సర్‌ప్రైజ్‌
X

రామ్‌ చరణ్ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించిన గేమ్‌ ఛేంజర్‌ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న గేమ్‌ ఛేంజర్‌ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ అయ్యాయి. షూటింగ్‌ ఇప్పటికే పూర్తి కాగా, పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉన్నాయి. అతి త్వరలోనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున యూఎస్‌లో నిర్వహించబోతున్న విషయం తెల్సిందే. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుకుమార్‌ ముఖ్య అతిథిగా యూఎస్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరగబోతుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఎత్తున పబ్లిసిటీ ఈవెంట్స్ జరుగనున్నాయి.

గేమ్‌ ఛేంజర్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఈ సమయంలో ఆ అంచనాలను మరింతగా పెంచే విధంగా సీనియర్‌ నటుడు శ్రీకాంత్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాలోని తన పాత్ర గురించి గొప్పగా చెప్పిన శ్రీకాంత్‌ కచ్చితంగా ఈ సినిమా ప్రతి ఒక్కరిని మెప్పిస్తుందని హామీ ఇచ్చారు. అంతే కాకుండా ఈ సినిమా రికార్డ్‌ స్తాయి వసూళ్లు సాధిస్తుందనే నమ్మకంను వ్యక్తం చేశారు. ఈ సినిమాలో ఎస్‌ జే సూర్య పాత్ర ప్రతి ఒక్కరిని సర్‌ప్రైజ్ చేస్తుంది అంటూ బలంగా చెప్పుకొచ్చారు.

ఈ మధ్య కాలంలో ఎస్‌ జే సూర్య సరిపోదా శనివారం సినిమాలో విభిన్నమైన పాత్రలో నటించారు. ఆ పాత్రను చూసి ప్రతి ఒక్కరు షాక్‌ అయ్యారు. ఇప్పుడు అదే విధంగా అంతకు మించి అన్నట్లుగా గేమ్‌ ఛేంజర్‌లోనూ ఆయన పాత్రను చూసి షాక్ అవుతారు అంటూ నమ్మకంగా చెప్పుకొచ్చాడు. బాక్సాఫీస్ వద్ద గేమ్‌ ఛేంజర్ సినిమా భారీ ఎత్తున వసూళ్లు సాధిస్తుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. తాజాగా శ్రీకాంత్‌ చేసిన వ్యాఖ్యలు ఆ నమ్మకంను మరింతగా పెంచే విధంగా ఉన్నాయి అంటూ మెగా ఫ్యాన్స్‌తో పాటు సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రామ్ చరణ్ ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు. మొదటి సారి తండ్రి కొడుకులుగా నటిస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. రామ్‌ చరణ్‌ తండ్రి పాత్రలో నటిస్తుండగా, ఆ పాత్రకు అంజలి జోడీగా నటిస్తూ ఉండగా, కొడుకు పాత్రలో నటిస్తున్న చరణ్ పాత్రకు జోడీగా బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కియారా అద్వానీ నటించింది. ఈ సినిమాలో పలువురు ప్రముఖులు నటించారు. శంకర్‌ ఈ సినిమాతో బ్యాక్ టు ఫామ్‌ అంటూ ఆయన ఫ్యాన్స్ చాలా నమ్మకం గా కనిపిస్తున్నారు. సంక్రాంతికి రాబోతున్న పెద్ద సినిమాల్లో గేమ్‌ ఛేంజర్‌ అతి పెద్ద సినిమా. ఈ సినిమాపైనే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. మరి శంకర్‌ మెగా ఫ్యాన్స్ ఆశలను అంచనాలను ఏం చేస్తాడు అనేది చూడాలి.