Begin typing your search above and press return to search.

'చిరంజీవిని వింటేజ్‌ లుక్‌లో చూడరు కానీ'.. శ్రీకాంత్ ఓదెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మెగాస్టార్ చిరంజీవి, ‘దసరా’ ఫేమ్‌ శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌ ఫిక్స్‌ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   30 Dec 2024 10:30 PM GMT
చిరంజీవిని వింటేజ్‌ లుక్‌లో చూడరు కానీ.. శ్రీకాంత్ ఓదెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

మెగాస్టార్ చిరంజీవి, ‘దసరా’ ఫేమ్‌ శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌ ఫిక్స్‌ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. మోస్ట్ వైలెంట్ మూవీతో రాబోతున్నట్లు ప్రీలుక్ పోస్టర్ తోనే హింట్ ఇచ్చారు. ఇదొక పీరియడ్ యాక్షన్ మూవీ అని నిర్మాత చెరుకూరి సుధాకర్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాజాగా దర్శకుడు శ్రీకాంత్‌ ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. 48 గంటల్లో ఈ స్క్రిప్ట్ ఫైనల్ చేశామని, తనకిప్పుడు మబ్బుల్లో తేలుతున్నట్టు ఉందని అన్నారు.

"చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనతో పని చేస్తున్నానంటే నమ్మలేకపోతున్నాను. ఆయన గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా ఎంతో ప్రత్యేకంగా, విభిన్నంగా ఉంటుంది. మీరు ఆయన్ని వింటేజ్‌ లుక్‌లో చూడరు కానీ, ఒక ఫ్రెష్ లుక్ లో కొత్త అవతార్‌లో చూడబోతున్నారు. ఆయన క్యారక్టర్ ఎంతో పవర్‌ ఫుల్‌గా ఉంటుంది. 48 గంటల్లోనే మేము స్క్రిప్ట్‌ ఫైనల్ చేసేశాం. నాకైతే మబ్బుల్లో తేలుతున్నట్టు ఉంది. ఆయన క్యూరియాసిటీ నాలో ఎంతో స్ఫూర్తి నింపింది. చిరంజీవి క్యార్వాన్ నుంచి బయటకు వచ్చే వరకు మాత్రమే నేను ఆయన ఫ్యాన్ ని. ఒక్కసారి సెట్‌లోకి అడుగుపెట్టారంటే నా సినిమాలో చిరంజీవి ఒక పాత్ర" అని శ్రీకాంత్‌ ఓదెల తెలిపారు.

సుకుమార్‌ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన శ్రీకాంత్ ఓదెల.. గతేడాది వచ్చిన ‘దసరా’ సినిమాతో డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. తన తండ్రి వల్లే తాను 'దసరా' స్టోరీ రాసుకున్నట్లు శ్రీకాంత్ చెబుతున్నారు. 'బ్రోచేవారెవరురా' చూసిన తర్వాత సినిమాల్లోకి రావాలని గట్టిగా ఫిక్స్ అయ్యా. చదువుకు సంబంధించిన సర్టిఫికేట్స్‌ అన్నీ తగలపెట్టేసి సినిమాల్లోకి వచ్చాను. నా చిన్నతనంలో మా నాన్న బొగ్గు గనుల్లో పనిచేయడానికి వెళ్లేవారు. ఆ స్ఫూర్తితోనే ‘దసరా’ కథ రాశాను అని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీకాంత్ చెప్పారు.

శ్రీకాంత్ ప్రస్తుతం నేచురల్ స్టార్ నానితో 'ది ప్యారడైజ్‌' అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ సెట్స్ మీద వుండగానే చిరంజీవి ప్రాజెక్ట్ ను ప్రకటించారు. నాని సమర్పణలో సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "హింసలోనే అతడు తన శాంతిని వెతుక్కున్నాడు" అంటూ చేతి నిండా రక్తం కారుతున్న ప్రీ లుక్ పోస్టర్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసారు. ప్రస్తుతం ఈ మెగా మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్యారడైజ్‌ సినిమా కంప్లీట్ అయిన తర్వాత శ్రీకాంత్ ఓదెల - చిరు ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది.

మరోవైపు వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు చిరంజీవి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ మూవీ.. వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఇక శ్రీకాంత్ ఓదెలతో పాటుగా డైరెక్టర్ అనిల్ రావిపూడితో వర్క్ చేయడానికి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కొత్త ఏడాదిలో ఈ క్రేజీ కాంబినేషన్ ను ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇదే క్రమంలో 'వాల్తేరు వీరయ్య' దర్శకుడు బాబీతో చిరు మరోసారి చేతులు కలపబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.