శ్రీకాంత్ బయోపిక్ అతిపెద్ద ఛాలెంజ్!
హెయిర్ స్టైల్ ..ఎంపిక చేసుకున్న కాస్ట్యూమ్స్..శ్రీకాంత్ లో అమాయకత్వం ప్రతీది దించేసాడు.
By: Tupaki Desk | 7 May 2024 8:30 AM GMTహైదరాబాద్‌కు చెందిన ప్రముఖ అంధ పారిశ్రామికవేత్త - బొల్లాంట్ ఇండస్ట్రీస్ అధినేత శ్రీకాంత్ బొల్లా జీవితం బాలీవుడ్ లో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. `శ్రీకాంత్’ టైటిల్‌తో ఈ సినిమాని తుషార్ హీరానందానీ తెరకెక్కిస్తున్నారు. ఇందులో శ్రీకాంత్ పాత్రలో రాజ్ కుమార్ రావు నటిస్తున్నాడు. ఇప్పటికే శ్రీకాంత్ ఆహార్యంలో రాజ్ కుమార్ ఒదిగిపోయిప వైనం విమర్శలకు ప్రశంసలు కురిపించింది. అతడి లుక్ ఆద్యంతం ఒరిజినల్ ఫీల్ కి ఏమాత్రం తగ్గలేదు. హెయిర్ స్టైల్ ..ఎంపిక చేసుకున్న కాస్ట్యూమ్స్..శ్రీకాంత్ లో అమాయకత్వం ప్రతీది దించేసాడు.
శ్రీకాంత్ పాత్రలో రాజ్ కుమార్ జీవించినట్లే హైలైట్ చేసారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకు మంచి బజ్ క్రియేట్ అయింది. తాజాగా శ్రీకాంత్ పాత్ర గురించి రాజ్ కుమార్ రావ్ ఎలా సన్నదం అయ్యారన్నది రివీల్ చేసారు. సెట్ లోకి వెళ్లిన తర్వాత చాలా సవాళ్లు ఎదురయ్యాయి. చూడగలిగే పరిస్థితి ఉన్నా చూడకుండా ..గమనిం చకుండా రోజుకి 12..13 గంటలు శ్రీకాంత్ లాగే ఉంటూ ఆయన జీవితాన్ని గడిపాను. అది చాలా కష్టంగా అనిపించేది.
శ్రీకాంత్ ని కలవడానికి ముందు తన జీవితం ఎంత కష్టంగా ఉంటుందో? రోజు వారి పనుల్లో చాలా మంది సహాయం తీసుకుంటారేమో అనుకునేవాడిని. కానీ ఆయన చాలా సాధారణంగా జీవితాన్ని గడిపారు. తన పనులు తానే సొంతంగా చేసుకునే సమర్ధత కనిపించింది. ఎదుట వారి నుంచి ఆయన కేవలం గౌరవం మాత్రమే కోరుకుంటారు. సింపతీ ..ప్రేమ..కరుణ లాంటివి అస్సలు కోరుకోరు. ఆ పాత్రలో నటిస్తున్నంత సేపు ఆయన వ్యక్తిత్వం.. జీవన శైలినే గుర్తు చేసుకుంటూ నటించా. అంధుడి జీవితం కథ అని అంతా దుఖంతో ఉంటుందనుకోవద్దు.
ఇందులో చాలా ఫన్ ఉంటుంది. యువతలో స్పూర్తిని నింపే అంశాలెన్నో ఉంటాయి. శ్రీకాంత్ ని కలవడానికి ముందు ముంబైలో అంధుల స్కూళ్లకు వెళ్లాను. వాళ్ల గురించి తెలుసుకుని..వాళ్ల హవభాలు పట్టుకునే ప్రయత్నం చేసా. కొన్నిసార్లు వీడియోలు తీసుకుని ఇంటికెళ్లి పదే పదే చూసేవాడిని. కానీ అసలు శ్రీకాంత్ ని కలిసిన తర్వాత తన జీవితం..నాటకీయత...మోషన్ పై పూర్తి క్లారిటీ వచ్చింది. కానీ నటించేటప్పుడు ప్రతీసారి సవాల్ గానే అనిపించేది` అన్నారు.