పద్దతిగా చెప్పా.. వినకపోతే కోర్టుకే: శ్రీకాంత్
బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన అనేక రకాల విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న విషయం తెలిసిందే
By: Tupaki Desk | 24 May 2024 7:50 AM GMTబెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన అనేక రకాల విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీకి చెందిన కొంత మంది ప్రముఖులు కూడా ఈ వ్యవహారంలో ఉన్నారు అంటూ ఇప్పటికే పోలీసులు తెలియజేశారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కూడా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన సీనియర్ హీరోతో పాటు ఒక సీనియర్ నటి కూడా ఉంది అన్నట్లుగా కూడా కథనాలు వచ్చాయి.
అయితే ఈ విషయంపై ఎప్పటికప్పుడు సినీ నటులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సీనియర్ హీరో శ్రీకాంత్ కూడా తప్పుడు వార్తలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొదట శ్రీకాంత్ తప్పుడు వార్తలపై చాలా మర్యాదగా సున్నితంగానే స్పందించారు. రేవ్ పార్టీకి సంబంధించిన న్యూస్ బయటకు రాగానే ఎవరో శ్రీకాంత్ తరహాలో ఉండడంతో అందరూ కూడా నేను అని పొరపాటు పడ్డారని అన్నారు.
ప్రత్యేకంగా ఒక వీడియో కూడా విడుదల చేసిన శ్రీకాంత్ అందులో తనపై తప్పుడు వార్తలు వస్తున్నాయి అని అసలు పార్టీలకి వెళ్లే మనిషిని తాను కాదు అని ఎవరో తనలా ఉంటే పొరపాటు పడ్డారని, అయితే అతను నేను కాదు అంటూ శ్రీకాంత్ ఎంతో పద్ధతిగా తెలియజేశారు. అంతకు ముందు కొంతమంది మీడియా మిత్రులు కూడా తనకు ఫోన్ చేసి ఈ విషయం గురించి అడిగారు అని అలా ముందుగా వెరిఫై చేసుకోవడం చాలా మంచిది అంటూ తనకు కాంటాక్ట్ చేసిన ప్రతి మీడియా సభ్యుడికి కూడా తాను వివరణ ఇచ్చినట్లుగా శ్రీకాంత్ తెలియజేశారు.
ఇక రీసెంట్ గా మరోసారి శ్రీకాంత్ పేరు మళ్లీ వైరల్ గా మారడంతో ఆయన చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. నిజమైతే ఉన్నది ఉన్నట్లు వార్తలు రాయండి, లేదంటే వదిలేయండి. అంతే కాని అనవసరంగా తప్పుడు వార్తలు వస్తే ఏ మాత్రం సహించేది లేదు అని, నేను లేకపోయినా కూడా, ఉన్నాను అంటూ వార్తలు రాయడం ఏమాత్రం కరెక్ట్ కాదని అన్నారు.
ఇదే తరహాలో రిపీట్ అయితే నేను చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని కోర్టులో కూడా తేల్చుకుంటాను అని శ్రీకాంత్ చాలా సీరియస్ గా తెలియజేశారు. అసలు రేవ్ పార్టీలకు తనకు ఎలాంటి సంబంధం లేదు అని శ్రీకాంత్ మీడియాకు తెలియజేయడంతో ప్రస్తుతం ఈ విషయం మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది.
మరోవైపు సినీనటి హేమ గురించి కూడా అనేక రకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆమె మరో పేరుతో రేవ్ పార్టీలో పాల్గొంది అన్నట్లుగా కూడా కథనాలు వచ్చాయి. అయితే అందులో కూడా ఏ మాత్రం నిజం లేదు అని ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి ఈ విషయంలో పోలీసులు తదుపరి విచారణలో ఏం తెలుస్తారో చూడాలి.