Begin typing your search above and press return to search.

శ్రీలీల మళ్లీ పుంజుకుంటుందిగా..!

కెరీర్ లో ఎంత తక్కువ టైం లో స్టార్ క్రేజ్ వచ్చిందో అంతే త్వరగా డౌన్ ఫాల్ అయ్యింది శ్రీలీల. కొద్దిపాటి గ్యాప్ తో మళ్లీ శ్రీలీల వరుస అవకాశాలు అందుకుంటుంది.

By:  Tupaki Desk   |   14 March 2025 6:00 AM IST
శ్రీలీల మళ్లీ పుంజుకుంటుందిగా..!
X

పెళ్లిసందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీలీల మాస్ మహరాజ్ రవితేజ ధమాకాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ సినిమా తర్వాత అమ్మడు వరుస సినిమా ఛాన్స్ లు అందుకుంది. ఐతే చేయడానికి అరడజను సినిమాల దాకా చేసినా అందులో భగవంత్ కేసరి, గుంటూరు కారం తప్ప మిగతా సినిమాలన్నీ కూడా డిజప్పాయింట్ చేశాయి. కెరీర్ లో ఎంత తక్కువ టైం లో స్టార్ క్రేజ్ వచ్చిందో అంతే త్వరగా డౌన్ ఫాల్ అయ్యింది శ్రీలీల. కొద్దిపాటి గ్యాప్ తో మళ్లీ శ్రీలీల వరుస అవకాశాలు అందుకుంటుంది.

ప్రస్తుతం రవితేజతో మాస్ జాతర సినిమా చేస్తున్న శ్రీలీల నితిన్ రాబిన్ హుడ్ తో ఈ మంత్ ఎండ్ రాబోతుంది. ఈ సినిమాలతో పాటుగా అమ్మడు లేటెస్ట్ గా మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తుంది. ఇప్పటికే తెలుగుతో పాటు హిందీలో కార్తీక్ ఆర్యన్ తో ఒక సినిమా చేస్తుంది అమ్మడు. కోలీవుడ్ లో కూడా శివ కార్తికేయన్ తో పరాశక్తి సినిమాలో అవకాశం దక్కించుకుంది.

వీటితో పాటు మళ్లీ తెలుగు స్టార్ ఛాన్స్ లు వరుస కడుతున్నాయి. ఈ సినిమాలతో మళ్లీ శ్రీలీల పుంజుకుంటుందని చెప్పొచ్చు. శ్రీలీల డ్యాన్స్ సినిమాలకు అడ్వాంటేజ్ అవుతుంది. ఆమె ఉంటే మ్యూజిక్ అదిరిపోతుంది. ఐతే శ్రీలీలతో కలిసి డ్యాన్స్ చేయాలంటే హీరోలు కాస్త కష్టపడాల్సి వస్తున్నా కూడా అమ్మడు మాత్రం తన ఫ్యాన్స్ ని అలరించేందుకు అదరగొట్టేస్తుంది.

రాబిన్ హుడ్ వైబ్ చూస్తుంటే శ్రీలీల ఖాతాలో ఒక హిట్ పడేలా ఉంది. ఇక వీటితో పాటుగా పవర్ స్టార్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఉండనే ఉంది. సో అమ్మడు మళ్లీ తన స్టార్ మేనియా కొనసాగించాలని చూస్తుంది. శ్రీలీల తప్పకుండా మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చేలా ఉంది. స్టార్ సినిమాలే కాదు యువ హీరోల సినిమాలతో కూడా శ్రీలీల ఆకట్టుకుంటుంది. రాబిన్ హుడ్, మాస్ జాతర ఇలా టాలీవుడ్ లో మళ్లీ తన పంథా కొనసాగించాలని చూస్తుంది.

బాలీవుడ్ లో శ్రీలీల చేస్తున్న సినిమా ఆషికి 2 సీక్వెల్ అనే టాక్ ఉంది. కార్తీక్ ఆర్యన్ తో అమ్మడు లిప్ లాక్స్ గట్రా కానిచ్చినట్టు చెప్పుకుంటున్నారు. మరి శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఆమెకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుంది అన్నది చూడాలి. ఐతే సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా అమ్మడు అదరగొట్టాలని చూస్తుంది.