Begin typing your search above and press return to search.

శ్రీమంతుడు కాంట్రవర్సీ.. 'అప్పుడే అంచనాలకు రావద్దు'-

2015లో విడుదలైన శ్రీమంతుడు సినిమా కాంట్రవర్సీ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది

By:  Tupaki Desk   |   2 Feb 2024 11:21 AM GMT
శ్రీమంతుడు కాంట్రవర్సీ.. అప్పుడే అంచనాలకు రావద్దు-
X

2015లో విడుదలైన శ్రీమంతుడు సినిమా కాంట్రవర్సీ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. మహేశ్ బాబు, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన ఈ మూవీపై కాపీరైట్స్ కేసు నమోదైన విషయం తెలిసిందే. రైటర్ శరత్ చంద్ర అలియాస్ ఆర్డీ విల్సన్ ఈ కాపీరైట్ కేసును నమోదు చేశారు. తన చచ్చేంత ప్రేమ నవల నుంచి శ్రీమంతుడు స్టోరీని కాపీ కొట్టారని ఆరోపించారు. ఇక ఈ విషయంపై ఇండస్ట్రీలో అనేక అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు ఆర్డీ విల్సన్ కరెక్ట్ అంటే.. కొందరు కొరటాల శివ కరెక్ట్ అంటున్నారు.


తన కథను కాపీ కొట్టినందుకు శ్రీమంతుడు మేకర్స్ డబ్బులు ఇవ్వాలని తాను కోరుకోవడం లేదని శరత్ చంద్ర ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ ఆయనకు క్రెడిట్ కావాలని మాత్రం అడిగారు. కొరటాల శివ తనకు ఓపెన్‌ గా క్షమాపణలు చెప్పాలని అన్నారు. ఇక ఈ విషయంపై శ్రీమంతుడు మేకర్స్ తాజాగా స్పందించి స్టేట్మెంట్ విడుదల చేశారు. ఈ విషయంపై ఏ అంచనాలకు రావద్దని మీడియాను కోరారు. ప్రస్తుతం చట్టపరమైన చర్యలు సాగుతున్నాయని క్లారిటీ ఇచ్చారు.

శ్రీమంతుడు క్రియేటివ్ టీమ్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. "చచ్చేంత ప్రేమ నవలకు, కొరటాల శివ తెరకెక్కించిన శ్రీమంతుడుకి పోలికలు ఉన్నాయని ఆరోపణలపై మాట్లాడడానికి ఈ ప్రకటన విడుదల చేస్తున్నాం. ఈ రెండు కూడా వేటికవే భిన్నమైనవి. సినిమాను, పుస్తకాన్ని రెండింటినీ చూసినవారికి ఈ తేడా స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ విషయం లీగల్ రివ్యూలో ఉంది. ఇంకా దీనిపై తీర్పులు ఏం రాలేదు. అందుకే ముందే అంచనాలకు రావద్దని మీడియాను కోరుతున్నాం."

"శ్రీమంతుడు కథపై సదరు రచయిత చేస్తున్న ఆరోపణలు అన్నీ నిరాధారమైనవి. ఆ విషయంపై కోర్టు గానీ, రచయితల సంఘం గానీ ఎటువంటి తీర్పు ఇవ్వలేదనే వాస్తవాన్ని అందరూ గ్రహించాలి. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై అసత్య ప్రచారాలు చేస్తే.. ఎవరిమీదైనా సరే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. దయచేసి ఆధారం లేని ఆరోపణలను ప్రచారం చేయొద్దని మీడియా వారిని కోరుతున్నాం" అని చెప్పారు.

ఇక మహేశ్ బాబు శ్రీమంతుడు సినిమాతోనే మళ్లీ ఫామ్ లోకి వచ్చారని చెప్పవచ్చు. కలెక్షన్స్ విషయంలో కూడా ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ అయింది. ఇక ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాపై కాంట్రవర్సీ క్రియేట్ అవ్వడంతో మహేశ్ ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. కానీ మూవీ మేకర్స్ మాత్రం తమ తప్పు ఏం లేదని బలంగా నమ్ముతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.