మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి హీరోయిన్గా!
చదువు దగ్గర నుంచి స్థిరపడ్డ వృత్తి వరకూ వాళ్ల జీవితం..లైఫ్ స్టైల్ అంతా సామాన్యుడి ఊహించలేని విధంగా ఉంటుంది.
By: Tupaki Desk | 21 Oct 2024 5:30 PM GMTపాత తరం హీరోయిన్ల సంగతేమో గానీ..నేటి జనరేషన్ హీరోయిన్ల బ్యాక్ గ్రౌండ్ చెక్ చేస్తే? దిమ్మ తిరిగిపోతుంది. ఒక్కొక్కరి బ్యాక్ గ్రౌండ్ షాకింగ్ అనిపిస్తుంది. తల్లిదండ్రులు..తాతలు కోట్లాది రూపాలయ వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించి మనవరాళ్లకు ప్రేమతో దారాదత్తం చేసినట్లే కనిపిస్తుంది. చదువు దగ్గర నుంచి స్థిరపడ్డ వృత్తి వరకూ వాళ్ల జీవితం..లైఫ్ స్టైల్ అంతా సామాన్యుడి ఊహించలేని విధంగా ఉంటుంది. హీరోయిన్ అవ్వాలంటే ఆ మాత్రం బ్యాక్ గ్రౌండ్ తప్పనిసరి.
లేకపోతే సినిమా అవకాశాలు అనేది అంత ఈజీ కాదు. మోడలింగ్ మొదలు పెట్టడం అక్కడ నుంచి యాడ్స్ ప్రమోట్ కి అవ్వడం...ఆ రెండింటా రాణించిన తర్వాత సినిమాలకు ప్రమోట్ అవ్వడం. ఇదంతా జరగడం అన్నది అంత ఈజీ ప్రోసస్ కాదు. డబ్బు, ట్యాలెంట్ ఉంటే సరిపోదు. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. అప్పుడే సక్సెస్ అయ్యేది. సక్సెస్ అయిన వాళ్లు అంతా అలా వచ్చిన వారే. కానీ శ్రీనిధి శెట్టి కెరీర్ మాత్రం ఇలాంటి వాళ్లందరికీ భిన్నం.
ఆ సంగతేంటో ఆమె మాటల్లోనే, ` మంగుళూరు దగ్గర చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగాను. మధ్య తరగతి కుటుంబం. నాన్న చిరు ఉద్యోగి. అమ్మ నేను ఉద్యోగం చేయాలని కలలు కనేది. కానీ నాకు సినిమాలంటే ఇష్టం. మాకు దగ్గర్లో థియేటర్లు ఉండేవి కాదు. దాంతో మా మావయ్య సినిమా సీడీలు అద్దెకు తెచ్చి ఇచ్చేవారు. నేను చూసిన మొదటి సినిమా `మొఘల్ ఏ అజామ్`. ఆ సినిమా చూసిన తర్వాతే హీరోయిన్ అవ్వాలనుకున్నా` అని తెలిపింది.
శ్రీలీల చదువులో ఎంతో చురుకుగా ఉండేది. ఇంజనీరింగ్ లో బెంగుళూరు యూనివర్శిటీ టాపర్. చదువు అనంత రం కొన్నాళ్ల పాటు యాక్సెంచర్ లో ఇంజనీర్ గా ఉద్యోగం చేసింది. కానీ మనసు సినిమాలు కోరుకోవడంతో మోడలింగ్ లోకి ఎంటర్ అయింది. ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంది. అటుపై యాడ్స్ చేసింది. పేపరులో శ్రీలీల ఫోటో చూసి దర్శకుడు యశ్ ఫోన్ చేసి `కేజీఎఫ్` లో అవకాశం ఇచ్చాడు. శ్రీనిధి అలా హీరోయిన్ అయింది.