అమ్మడికి జాక్ పాట్ తగులుతుందా..?
ఐతే కె.జి.ఎఫ్ తర్వాత తెలుగులో ఆఫర్లు వచ్చినా అమ్మడు సరైన రెస్పాన్స్ ఇవ్వలేదని అప్పట్లో టాక్ వచ్చింది.
By: Tupaki Desk | 26 March 2025 7:30 PMఎవరైనా పాన్ ఇండియా కొట్టిన సినిమాలో హీరోయిన్ గా నటించిన తర్వాత ఆ భామ వరుస క్రేజీ సినిమాలతో అదరగొట్టేస్తూ కెరీర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగించాలి కానీ కె.జి.ఎఫ్ మొదటి రెండు భాగాలతో సెన్సేషనల్ హిట్ కొట్టినా కూడా శ్రీనిధి శెట్టి ఛాన్స్ లు అందుకోలేదు. ఆఫ్టర్ కె.జి.ఎఫ్ చియాన్ విక్రం తో కోబ్రా చేయగా అది కస్తా ఫ్లాప్ అయ్యింది. ఐతే కె.జి.ఎఫ్ తర్వాత తెలుగులో ఆఫర్లు వచ్చినా అమ్మడు సరైన రెస్పాన్స్ ఇవ్వలేదని అప్పట్లో టాక్ వచ్చింది.
ఇదిలాఉంటే ప్రస్తుతం శ్రీనిధి శెట్టి రెండు తెలుగు సినిమాలు చేస్తుంది. అందులో ఒకటి న్యాచురల్ స్టార్ నానితో చేస్తున్న హిట్ 3 కాగా మరొకటి సిద్ధు జొన్నలగడ్డతో చేస్తున్న తెలుసు కదా. ఐతే నాని హిట్ 3 సినిమా మే 1న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు నాని అండ్ టీం. సినిమా నుంచి ఈమధ్యనే ఒక లవ్ సాంగ్ రిలీజైంది.
ఈ సాంగ్ చూస్తుంటే శ్రీనిధి తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకునేలా ఉంది. హిట్ ఫ్రాంచైజీలో 3వ సినిమాగా వస్తుంది హిట్ ది థర్డ్ కేస్. ఈ సినిమాలో నాని తో శ్రీనిధి జోడీ కట్టడం ఆమెకు లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు. అంతేకాదు సినిమా నుంచి రీసెంట్ గా రిలీజైన టీజర్ చూస్తే ఇది నాని మార్క్ యానిమల్ సినిమాగా అనిపించింది.
ప్రస్తుతం వరుస సూపర్ హిట్లతో మంచి ఫాం లో ఉన్నాడు నాని. అలాంటి హీరోతో జత కట్టడం అంటే శ్రీనిధి లక్కీ అన్నట్టే చెప్పొచ్చు. సినిమాలో శ్రీనిధి లుక్స్ చాలా బాగున్నాయి. హిట్ 3 హిట్ పడితే ఆ వెంటనే తెలుసు కదా రిలీజై అది కూడా సక్సెస్ అయితే మాత్రం టాలీవుడ్ లో శ్రీనిధికి మంచి పాపులారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.
శ్రీనిధి శెట్టి కూడా తెలుగులో మంచి సినిమాలు చేయాలని ఉత్సాహంగా ఉంది. నాని సినిమాతో ఎంట్రీ ఇస్తున్న ఈ అమ్మడు సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగించే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. తెలుగులో కాకుండా కన్నడలో కిచ్చా సుదీప్ నెక్స్ట్ సినిమాలో కూడా లక్కీ ఛాన్స్ పట్టేసింది శ్రీనిధి శెట్టి. సో రాబోయే రోజుల్లో సౌత్ స్టార్ హీరోయిన్ గా శ్రీనిధి సత్తా చాటే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.