రానా మూవీతో కేజీఎఫ్ లింక్..!
తేజ సినిమా విషయం పక్కన పెట్టిన రానా కొత్త దర్శకుడు కిషోర్ తో కలిసి ఒక సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.
By: Tupaki Desk | 22 Jun 2024 3:30 PM GMTటాలీవుడ్ యంగ్ హీరో రానా ఆచి తూచి సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలు చాలా తక్కువ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని నెలల క్రితం తేజ దర్శకత్వంలో ఒక సినిమాను ప్రకటించిన రానా ఈ మధ్య కాలంలో దాని ఊసే ఎత్తడం లేదు.
తేజ సినిమా విషయం పక్కన పెట్టిన రానా కొత్త దర్శకుడు కిషోర్ తో కలిసి ఒక సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. బాహుబలి సినిమాను నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ నిర్మించబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టిని నటింపజేస్తున్నారు.
కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్థాయి గుర్తింపు దక్కించుకున్న శ్రీనిధి శెట్టి కి లక్ కలిసి రాలేదు. కేజీఎఫ్ హిట్ ను ఆమె సద్వినియోగం చేసుకోవడంలో విఫలం అయ్యింది. ఆమె వేసిన తప్పటడుగులు ఆమె కెరీర్ లో మంచి సమయం మిస్ అయ్యేలా చేసిందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికి కూడా కేజీఎఫ్ హీరోయిన్ అంటూ శ్రీనిధి శెట్టికి పాన్ ఇండియా ఇమేజ్ ఉంది. కనుక ఆమె కాస్త శ్రద్ద పెట్టి సినిమాలను ఎంపిక చేసుకుంటే ఖచ్చితంగా సౌత్ లోనే కాకుండా అన్ని చోట్ల కూడా మంచి పేరు సొంతం చేసుకోవడంతో పాటు స్టార్ డమ్ దక్కే అవకాశాలు ఉన్నాయి.
రానా చాలా కాలం తర్వాత నటిస్తున్న సినిమా అవ్వడంతో పాటు, కేజీఎఫ్ హీరోయిన్ ఈ సినిమాలో నటించబోతుంది అనే లింక్ ఉండటం వల్ల అంచనాలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రానా తో కిషోర్ ఈ సినిమా రూపొందించి ఇద్దరికి హిట్ ఇస్తాడేమో చూడాలి.