K.G.F భామ.. కాన్ఫిడెన్స్ మాత్రం తగ్గట్లేదు..!
K.G.F సినిమాతో కన్నడ పరిశ్రమకు పరిచయమైన శ్రీనిధి శెట్టి మొదటి సినిమాతోనే పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకుంది
By: Tupaki Desk | 20 April 2024 5:54 AMK.G.F సినిమాతో కన్నడ పరిశ్రమకు పరిచయమైన శ్రీనిధి శెట్టి మొదటి సినిమాతోనే పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకుంది. సాధారణంగా ఫస్ట్ సినిమా నేషనల్ లెవెల్ హిట్ కొట్టాక ఏ హీరోయిన్ అయినా వరుస సినిమాలతో అదరగొట్టేస్తుంది. K.G.F 1, 2 భాగాలు వచ్చి రెండేళ్లు అవుతుండగా ఈ పాటికి అమ్మడు కనీసం 10కి పైగా సినిమాలు చేయాల్సి ఉంది. కానీ శ్రీనిధి మాత్రం K.G.F తర్వాత ఒకే ఒక్క తమిళ సినిమా చేసింది అది కూడా వర్క్ అవుట్ కాలేదు.K.G.F తో వచ్చిన క్రేజ్ ని వాడుకోవడంలో పూర్తిగా విఫలమైంది శ్రీనిధి శెట్టి.
తెలుగులో శ్రీనిధికి ఆఫర్లు వచ్చినా మొదట్లో కాదనేసింది. టాలీవుడ్ లో యువ హీరోల సరసన ఛాన్సులు వచ్చినా అమ్మడు లైట్ తీసుకుంది. స్టార్ సినిమాల్లోనే నటిస్తానని కండీషన్ పెట్టిన అమ్మడిని ఆ తర్వాత ఎవరు పట్టించుకోలేదు. అందుకే చిన్నగా మళ్లీ లైన్ లోకి వచ్చిన అమ్మడు సిద్ధు జొన్నలగడ్డ తో జత కట్టే అవకాశం దక్కించుకుంది. తెలుగులో హీరోయిన్స్ అంతా కేవలం స్టార్స్ తో నటించే స్టార్ క్రేజ్ దక్కించుకోలేదు.
తమలో టాలెంట్ ఉంటే చిన్న సినిమాల్లో నటించి కూడా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్నారు. అలా స్టార్ హీరోయిన్ గా అవతరించారు. అయితే ఈ ఫార్ములా లేట్ గా తెలుసుకున్న శ్రీనిధి తెలుగులో స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డతో తెలుసు కదా సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో రాశి ఖన్నా కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది.
మరీ లేట్ చేస్తే తనను హీరోయిన్ గా మర్చిపోతారన్న భయం మొదలైంది అనుకుంటా అందుకే శ్రీనిధి ఇక తన ఫోకస్ అంతా సినిమాల మీద పెడుతుంది. అయితే అమ్మడు సినిమాల కన్నా తన సోషల్ మీడియా ఫోటో షూట్స్ మీద ఎక్కువ దృష్టి పెడుతుంది. చేతిలో సినిమాలు లేకపోయినా ఫోటో షూట్స్ లో అమ్మడి కాన్ఫిడెన్స్ అదిరిపోతుంది. ఎక్కువగా గ్లామర్ సైడ్ కూడా ఓపెన్ అవ్వని శ్రీనిధి తన క్యూట్ లుక్స్ తోనే ఫాలోవర్స్ ని ఆకట్టుకుంటుంది.
K.G.F రెండు భాగాలతో హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న శ్రీనిధి అదే ఊపుతో అరడజనుకి పైగా సినిమాలు చేస్తే కెరీర్ ఒక రేంజ్ లో ఉండేది. కానీ అమ్మడు అతి జాగ్రత్త వల్ల కొంపమునిగేలా ఉంది. మరి సిద్ధుతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న శ్రీనిధికి ఇక్కడ ఏమాత్రం లక్ ఫేవర్ అవుతుందో చూడాలి.