అవసరాలకి పెళ్లి అవసరం లేదంటున్నాడు
ఇలా వెతికితే ఇండస్ట్రీ లో పెళ్లికాని ప్రసాద్ లు ఇంకా చాలా మందే ఉంటారనుకోండి
By: Tupaki Desk | 24 Jan 2024 2:45 AM GMTఇండస్ట్రీలో బ్యాచిలర్ హీరో ఎవరంటే ఠక్కున గుర్తొచ్చేది డార్లింగ్ ప్రభాస్. ఆయన పెళ్లి ఎప్పుడు చేసు కుంటాడా? అని ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నా ఆఘట్టాన్ని మాత్రం డార్లింగ్ పూర్తి చేయడం లేదు. పెళ్లి టాపిక్ తీసేసరికి స్కిప్ కొట్టేస్తున్నాడు. ఎలా జారుకోవాలా? అని చూస్తాడు. దీంతో అతడి పెళ్లి టాపిక్ కూడా కొన్ని నెలలుగా మీడియాలో రావడం లేదు. పెళ్లి చేసుకున్నప్పుడు చూద్దాంలే అని అంతా లైట్ తీసేసుకుంటున్నారు.
ఇలా వెతికితే ఇండస్ట్రీ లో పెళ్లికాని ప్రసాద్ లు ఇంకా చాలా మందే ఉంటారనుకోండి. తాజాగా అవసరాల శ్రీనివాస్ కూడా పెళ్లి చేసుకోలేదని తెలుస్తోంది. అవసరాల కూడా విదేశాల్లో ఉద్యోగం చేసి సినిమా రంగం లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. తనతో పాటు పనిచేసిన వారందరికీ పెళ్లిళ్లు అయి ఫ్యామిలీతో ఉన్నారు. కానీ అవసరాల మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో అడిగితే పెళ్లి అంటే తనకి ఎంత మాత్రం ఆసక్తి లేదని..అందుకే పెళ్లి చేసుకోలేదని తెలిపాడు.
తొలి నుంచి తాను వివాహానికి దూరంగానే ఉన్నాని..అలాగని వ్యతిరేకిని కాదని..తనకు మాత్రం ధాంపత్య జీవితం ఎందుకు? అని బలంగా అనిపిస్తుందని ఆ కారణంతోనే పెళ్లి ప్రయత్నాలు కూడా ఎప్పుడూ చేయలేదన్నాడు. చేసే ఆలోచన కూడా లేదు అంటున్నాడు. అంటే అవసరాల జీవితాంత బ్రహ్మచారిగా ఉండిపోవాలనుకుంటున్నాడో! ఏమో! ఇక నటుడిగా..దర్శకుడిగా..రచయితగా అవసరాలకి మంచి పేరున్న సంగతి తెలిసిందే.
అవసరాల బాగా చదువుకున్న వాడు. తెలివైన వాడు. అందుకే ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకపోయినా ఉద్యోగం చేసుకుంటూ సినిమా ప్రయత్నాలు చేసి ఇంతటి వాడు అయ్యాడు. కానీ పెళ్లి చేసుకోను అనే విషయమే అభిమానులకు కాస్త నిరుత్సాహ పరుస్తుంది. అలాగని కందకి లేని దురద కత్తికి ఎందుకు అనే యకండి. పెళ్లి అనేది పూర్తిగా వారి వ్యక్తిగత విషయానికి సంబంధించింది.