Begin typing your search above and press return to search.

70 శాతం పూర్త‌యిన వైట్ల క‌థ‌లో హీరో ఎవ‌ర‌బ్బా?

ద‌ర్శ‌కుడిగా శ్రీనువైట్ల ఎన్నో స‌క్సెస్లు చూసారు. ఎంతో మంది స్టార్ హీరోల‌ను డైరెక్ట్ చేసారు.

By:  Tupaki Desk   |   3 Dec 2024 6:08 AM GMT
70 శాతం పూర్త‌యిన వైట్ల క‌థ‌లో హీరో ఎవ‌ర‌బ్బా?
X

ద‌ర్శ‌కుడిగా శ్రీనువైట్ల ఎన్నో స‌క్సెస్లు చూసారు. ఎంతో మంది స్టార్ హీరోల‌ను డైరెక్ట్ చేసారు. ద‌ర్శ‌కుడిగా 25 ఏళ్ల సుదీర్ఘ ప్ర‌యాణం ఆయ‌న సొంతం. అయితే `ఆగ‌డు` ద‌గ్గ‌ర నుంచి ఆయ‌న కెరీర్ ఒక్క‌సారిగా మారిపోయింది. అప్ప‌టివ‌ర‌కూ వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోయిన వైట్ల అప్ప‌టి నుంచి వేగం త‌గ్గిపోయింది. చేసిన సినిమాలన్నీ వైఫ‌ల్యాల బాట ప‌ట్టాయి. అయినా వైట్ల బ్రాండ్ ఇమేజ్ తో అవకాశాలు అందుకోగ‌ల్గుతున్నారు.

ఇటీవ‌లే గోపీచంద్ తో తీసిన `విశ్వం` సినిమాతో కంబ్యాక్ అవ్వాల‌ని గట్టిగానే ప్ర‌య‌త్నించారు. త‌న మార్క్ ని చూపించే ప్ర‌య‌త్నం చేసారు. కానీ అది నిరాశ‌నే మిగిల్చింది. అయినా త‌గ్గేదేలే అంటూ వైట్ల దూసుకొస్తున్నారు. ఈసారి ఓ కొత్త ఐడియాతో ప్రేక్ష‌కుల ముందుకొస్తాన‌న‌న్న ధీమాని వ్య‌క్తం చేసారు. ఓ చిట్ చాట్ నెక్స్ట్ చేయ‌బోయే సినిమా గురించిన విష‌యాలు పంచుకున్నారు.

అవేంటో ఆయ‌న మాటల్లోనే..` ఇక‌పై నేను క‌థ‌ల్లో కొత్త‌ద‌నం..ఏదైనా వైవిధ్య‌త ఉంటేనే వాటితో ముందుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నా ప్ర‌స్తుతం ఓ కొత్త‌కుర్రాడు ఇచ్చిన కొత్త ర‌క‌మైన క‌థ‌తో పూర్తి స్థాయిలో వినోదాత్మ‌క చిత్రం తీయా ల‌నే ఆలోచ‌న‌లో ఉన్నాం. అది క‌చ్చితంగా పెద్ద హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం బ‌లంగా ఉంది. క‌థ ఇప్ప‌టికే 70 శాతం పూర్త‌యింది. త్వ‌ర‌లోనే న‌టీన‌టులతోపాటు, టెక్నీషియ‌న్ల వివ‌రాలు వెల్ల‌డిస్తాం` అన్నారు.

అయితే ఇందులో హీరో ఎవ‌రు? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌స్తుతం స్టార్ హీరోలంతా బిజీగా ఉన్నారు. టైర్-2 హీరోలు కూడా అంతే బిజీగా గ‌డుపుతున్నారు. పైగా వైట్ల ప్లాప్ ల్లో ఉన్నారు? ఛాన్స్ ఇచ్చే ముందు అత‌డి ట్రాక్ కూడా చెక్ చేస్తారు హీరోలు. మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల్లో శ్రీనువైట్ల ఏ హీరోని బరిలోకి దించుతారో చూడాలి.