గురువులతో లొసుగు తెలుసుకోమన్న చిన్మయి శ్రీపాద
తన మనసులోని మాటను చెప్పడానికి వెనుకాడని డేరింగ్ క్వీన్ గా చిన్మయి పాపులరైంది.
By: Tupaki Desk | 11 Feb 2024 11:30 PMతమిళ సంగీత పరిశ్రమలో మహిళలపై వేధింపుల గురించి గొంతెత్తిన తొలి గాయనిగా చిన్మయి శ్రీపాద పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. గురువులు తమ శిష్యులతో ఎలా ప్రవర్తించాలి? చెడు నుంచి ఔత్సాహిక గాయనీమణులు ఎలా బయటపడాలి? అనే విషయాలను మీటూ ఉద్యమంలో భాగంగా చిన్మయి శ్రీపాద చాలా విషయాలను ప్రస్థావించారు. తన మనసులోని మాటను చెప్పడానికి వెనుకాడని డేరింగ్ క్వీన్ గా చిన్మయి పాపులరైంది. తమిళ నేపథ్య గాయని, డబ్బింగ్ కళాకారిణి అయిన చిన్మయి సామాజిక సమస్యల గురించి మాట్లాడే ధైర్యాన్ని ఎలా సంపాదించారు? అని ప్రశ్నించగా ``ఇది కోపం నుండి వచ్చింది`` అని చెప్పింది.
గురు-శిష్య పరంపర (గురు-శిష్య సంప్రదాయం)లోని అనుబంధం గురించి ప్రశ్నించగా చిన్మయి వివరణ ఇలా ఉంది. ఇది కేవలం భారతీయుల సమస్య కాదు. ఇది ఆగ్నేయాసియా సమస్య. విప్లాష్ అనే ఈ సినిమా చూస్తే దాని గురించే మాట్లాడుతుంది అని అన్నారు. లింగం, కులం వంటి సామాజిక సమస్యల గురించి ఎప్పుడూ మాట్లాడే శ్రీపాద ఇటీవల గురు-శిష్య పరంపరను ప్రశ్నిస్తూ ఒక వీడియోను పోస్ట్ చేసిన తర్వాత అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక వ్యక్తిని శిష్యురాలు చెంపదెబ్బ కొట్టిన వీడియో ప్రదర్శించాక, తన క్షమాపణ వీడియోలో ఇది ఉపాధ్యాయుడు అతని విద్యార్థి మధ్య వ్యక్తిగత విషయం అని పేర్కొనడాన్ని చిన్మయి ప్రశ్నించింది. చిన్మయి శ్రీపాద తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసి అందులో ఇలా చెప్పింది, ``ఒక విషయం ఏమిటంటే, తల్లిదండ్రులు తమ ఉనికిని గురువుకు పూర్తిగా అప్పగిస్తారు. పిల్లలకు ఎలాంటి బోధన అయినా చేయండి. తమ తల్లిదండ్రులతో మాట్లాడేందుకు సురక్షితమైన స్థలం లేకుండా చేయొద్దు.. వారితో మాట్లాడండి..! అని వ్యాఖ్యానించింది.
ఈ వీడియోను పోస్ట్ చేయడానికి కారణాల గురించి మాట్లాడుతూ, ``చాలా మంది విద్యార్థులు తమ గురువుల గురించి MeToo ఉద్యమం సమయంలో వారు ఎదుర్కొన్న వేధింపుల గురించి మాట్లాడారు. కానీ వాటిని ఎవరూ నమ్మలేదు. ఇది కేవలం గురుశిష్య పరంపర వల్లనే. అందుకే ఆ వీడియోను పోస్ట్ చేశాను`` అని అన్నారు.
నా ఏకైక గురువు నా తల్లి. నేను ఎవరి దగ్గరా నేర్చుకోలేదు. కానీ నేను ఇతరుల నుండి గురువుల గురించి కథలు విన్నాను అని తెలిపింది. చిన్మయి శ్రీపాద తన గురువు అయిన తల్లితో ఉన్న సంబంధం గురించి మరోసారి చర్చిస్తానని అన్నారు.