Begin typing your search above and press return to search.

'ఆ ఛానెల్ తో సమస్య ఉంది.. అందుకే బయటకు వచ్చా'

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ సత్య.. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ కెరీర్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది.

By:  Tupaki Desk   |   16 July 2024 2:30 AM GMT
ఆ ఛానెల్ తో సమస్య ఉంది.. అందుకే బయటకు వచ్చా
X

నిన్నే పెళ్ళాడుతా, అత్తారింట్లో అక్కాచెల్లెలు, త్రినయని వంటి పలు సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులను ఓ రేంజ్ లో అలరించింది తెలుగమ్మాయి శ్రీ సత్య. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో కూడా నటించి మెప్పించింది. అయితే బిగ్ బాస్ షోతో తెలుగు ప్రజలకు మరింత చేరువైంది. సీజన్ 6లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఆమె.. తన అందం, ఆటతీరుతో సుమారు 103 రోజులపాటు హౌస్ లోనే గడిపింది. ఆ సమయంలో బాగానే ట్రెండ్ అయింది.

అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక మంచి అవకాశాలు అందుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ అలా ఏం జరగలేదు. ప్రస్తుతం టీవీ షోస్ తో బిజీగా గడుపుతోంది. బిగ్ బాస్ మరో కంటెస్టెంట్ మొహబూబ్‌ తో కలిసి ప్రైవేట్ ఆల్బమ్ చేస్తోంది. వాటి ద్వారా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఇటీవల స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ మూవీలో చిన్న పాత్రలో మెరిసింది. తక్కువ సేపే స్క్రీన్ పై కనిపించినా ఆకట్టుకుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ సత్య.. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ కెరీర్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. తాను టిల్లు స్క్వేర్ సినిమాలో ఎక్కువ సీన్స్ షూటింగ్ లో పాల్గొన్నానని తెలిపింది. కానీ మూవీ రిలీజయ్యే సరికి కాసేపే కనిపించానని, సినిమా నిడివి ఎక్కువ అవ్వడం వల్ల సీన్స్ కట్ చేశారని చెప్పింది. గతంలో అవకాశాల కోసం వెళ్తే.. ముఖం చిన్నదిగా కనిపిస్తోందని అనేవారని వెల్లడించింది.

"అందుకే ఆ సమస్యను ఎలా సరిదిద్దాలని ఆలోచిస్తుండగా లిప్ ఫిల్లర్స్ చేయిస్తే బాగుంటుందని తెలిసింది. మూడు నాలుగు నెలల కోసం లిప్ ఫిల్లర్స్ చేయించాను. అయితే ఇప్పుడు చాలామంది ముఖం పెద్దగా కనిపించి హీరోయిన్ లా ఉన్నానని అంటున్నారు.లుక్ బాగుందని చెబుతున్నారు" అని తెలిపింది. తాను వారానికి ఆరు లక్షలు సంపాదిస్తున్నానని వచ్చిన వార్తలపై స్పందించింది.

"కొంత మంది నేను వారానికి ఆరు లక్షలు సంపాదిస్తున్నానని అంటున్నారు. వాటిని నేనేం పట్టించుకోను. వారానికి ఆరు లక్షలు సంపాదిస్తే.. నెలకు ఎంత అవుతుంది.. అంత వస్తే కనీసం కారు అయినా కొనుక్కుంటా.. ఇప్పటి వరకు నాకు ఓన్ కారు లేదు. ఢీ ప్రొడ‌క్ష‌న్ టీమ్‌ తో స‌మ‌స్య‌ల వ‌ల్ల షో నుంచి వైదొలగలేదు., ఆశించిన రేటింగ్స్ రాక‌పోవ‌డం వ‌ల్ల ఆ షోను వదిలేశాను. ఆ ఛానెల్ నుంచి సమస్య ఉంది" అని తెలిపింది. ఏదేమైనా ఇండస్ట్రీలో నటిగా మంచి ఫేమ్ సంపాదించుకోవడమే తన టార్గెట్ గా చెప్పింది. మరి ఈ బ్యూటీకి హీరోయిన్ గా ఆఫర్స్ ఎప్పుడు వస్తాయో చూడాలి.