Begin typing your search above and press return to search.

స్వాగ్.. అందరూ అంతే..

తాజాగా తన రోల్స్ విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సినిమాలో తాను నాలుగు రోల్స్ చేస్తున్నట్లు మరోసారి తెలిపారు శ్రీవిష్ణు.

By:  Tupaki Desk   |   8 Sep 2024 4:50 AM GMT
స్వాగ్.. అందరూ అంతే..
X

కింగ్ ఆఫ్ కంటెంట్, యంగ్ హీరో శ్రీవిష్ణు వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ టాలీవుడ్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. వరుస హిట్లు అందుకుంటూ అదరగొడుతున్నారు. ఎంటర్టైన్మెంట్ తో కూడిన అట్రాక్టివ్ సబ్జెక్టులు ఎంచుకుంటూ రానిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే ఓం భీమ్ బుష్ తో మంచి హిట్ అందుకున్న శ్రీవిష్ణు.. ఇప్పుడు చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. త్వరలో స్వాగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్న స్వాగ్ మూవీ.. అక్టోబర్ 4వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుంది. హసిత్, శ్రీవిష్ణు కాంబోలో ఇప్పటికే వచ్చిన రాజ రాజ చోర మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. దీంతో స్వాగ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న స్వాగ్ నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, ఫస్ట్ సాంగ్ , రేజర్ వీడియో, టీజర్‌ అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్నాయి.

అయితే టీజర్ లో నాలుగు గెటప్స్ లో కనిపించారు శ్రీవిష్ణు. తన టాలెంట్ ఏంటో మరోసారి చూపించారు. తాజాగా తన రోల్స్ విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సినిమాలో తాను నాలుగు రోల్స్ చేస్తున్నట్లు మరోసారి తెలిపారు శ్రీవిష్ణు. తన క్యారెక్టర్స్ చుట్టూ కూడా అనేక గెటప్స్ ఉంటాయని చెప్పారు. చెప్పాలంటే.. తనతో పాటు సినిమాలోని లీడ్ రోల్స్ అన్నింటికీ డబుల్ యాక్షన్ ఉంటుందని తెలిపారు.

సినిమాలో ఒక జన్మలో ఉన్నవాళ్లు.. మళ్లీ మరో జన్మలో పుడతారని తెలిపారు. మూవీ కథను నడిపిస్తుంటారని చెప్పారు. అలా సినిమా స్టోరీని లైట్ గా లీక్ చేశారు. అయితే స్వాగ్ కోసం కెరీర్ లో ఫస్ట్ టైమ్ చాలా గెటప్స్ వేశానని వెల్లడించారు. కానీ భవభూతి రోల్ లో కాస్త ఇబ్బంది పడినట్లు తెలిపారు. ఆ ఒక్క రోల్ కోసం కొన్ని రోజులు సుమారు నాలుగు గంటలపాటు మేకప్ వేసుకున్నానని పేర్కొన్నారు. ఎండాకాలంలో షూటింగ్ జరగ్గా, చాలా చిరాకుగా అనిపించిందని చెప్పారు.

ఇక మూవీ విషయానికొస్తే.. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. మీరా జాస్మిన్, సునీల్, దక్షనాగర్కర్, శరణ్య ప్రదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేద రామన్ శంకరన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. జీఎం శేఖర్ ఆర్ట్ డైరెక్టర్ గా, నందు స్టంట్స్‌ మాస్టర్ గా వర్క్ చేస్తున్నారు. రవిబాబు, గెటప్ శ్రీను, గోపరాజు రమణ తదితరులు నటిస్తున్నారు. మరి స్వాగ్ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.