Begin typing your search above and press return to search.

సలార్ కాస్ట్యూమ్ తిప్పలు.. షూట్ అయ్యాక ఆమెకు సర్జరీ తప్పలేదట

తాజాగా సలార్ మూవీ షూట్ లో తాను పడిన కష్టాల్ని చెప్పుకొచ్చారు శ్రియ రెడ్డి. ప్రశాంత నీల్ సినిమాల్లో మాదిరే.. సలార్ లోనూ మహిళా పాత్రలు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి.

By:  Tupaki Desk   |   27 Dec 2023 5:00 AM GMT
సలార్ కాస్ట్యూమ్ తిప్పలు.. షూట్ అయ్యాక ఆమెకు సర్జరీ తప్పలేదట
X

ఒకటి తర్వాత ఒకటి అన్నట్లుగా భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. మొన్నటివరకు యానిమల్.. ఇప్పుడు సలార్ ప్రభంజనంతో రికార్డు కలెక్షన్లు నమోదవుతున్నాయి. ఈ సినిమాలోని కొన్ని క్యారెక్టర్లు ఇప్పుడు అందరి నోట నానుతున్నాయి. అలాంటి కోవలోకే వస్తుంది రాధారమ పాత్ర పోషించిన శ్రియరెడ్డి. స్క్రీన్ మీద ఆమె కనిపించిన ప్రతిసారీ.. ఆమె నడకలోనూ.. ఆమె మాడ్యులేషన్ అందరిని కట్టిపడేసేలా మారింది. సలార్ మూవీ గురించి మాట్లాడే వారంతా ఏదో ఒక సందర్భంలో రాధారమ పాత్ర గురించి మాట్లాడటం.. శ్రియ రెడ్డిని ప్రస్తావించటం జరుగుతోంది.

తాజాగా సలార్ మూవీ షూట్ లో తాను పడిన కష్టాల్ని చెప్పుకొచ్చారు శ్రియ రెడ్డి. ప్రశాంత నీల్ సినిమాల్లో మాదిరే.. సలార్ లోనూ మహిళా పాత్రలు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. అదే తీరు ఈ మూవీలోనూ కంటిన్యూ అయ్యింది. నెగిటివ్ రోల్ అయినప్పటికి రాధారమ పాత్రను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. శ్రియా రెడ్డి ఇప్పటికే పలు సినిమాల్లో చేసినా.. ఈ సినిమా ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేసింది.

రాధారమ పాత్ర కోసం శ్రియరెడ్డి చాలా కష్టపడినట్లుగా వెల్లడించారు. ముఖ్యంగా ఆమె ధరించిన కాస్ట్యూమ్స్ తో ఇబ్బందులు తప్పలేదట. ముఖ్యంగా చెబికి బరువైన చెవిపోగులు పెట్టుకున్న కారణంగా.. చెవులు చీరుకు పోయినట్లుగా పేర్కొన్నారు. దీంతో షూట్ తర్వాత సర్జరీ తప్పలేదని పేర్కొన్నారు. దీనికి తోడు మెడకు.. ముక్కుకు మక్కెరతో ఉండాల్సి రావటం.. ఆభరణాలు బరువుగా ఉండటం ఒకలాంటి ఇబ్బంది తప్పలేదట. ఇక.. ఈ మూవీలో ఆమె వస్త్రధారణ మొత్తం చీరలోనే సాగుతుంది.

ప్రశాంత్ నీల్ తనకు ఇచ్చిన అన్ని చీరలు ముదురు రంగులో ఉండటం.. ఒక చీరకు బదులుగా తాను పసుపు రంగు చీర అయితే బాగుంటుందని చెప్పానని.. కాదన్న నీల్ తో తాను గొడవ పడి మరీ పసుపురంగు చీరను ధరించినట్లుగా చెప్పారు. ఈ మూవీలో ఆ రంగు చీరలో కనిపించిన సీన్ ఆమె మరింత ఎఫెక్టివ్ గా కనిపించటం కనిపిస్తుంది. మొత్తంగా సలార్ మూవీలో తన పాత్ర కోసం రోటీన్ సినిమాలకు భిన్నంగా కష్టపడాల్సి వచ్చినట్లు చెబుతున్నారు.