సూపర్‌స్టార్ నెక్ట్స్ ఏంటో లీకిచ్చేశాడుగా
2023లో పఠాన్, జవాన్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల క్లబ్ అందుకున్నాడు షారూఖ్. ఆ తర్వాత విడుదలై డంకీ ఫర్వాలేదనిపించింది.
By: Tupaki Desk | 26 Jan 2025 2:30 AM GMT2023లో పఠాన్, జవాన్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల క్లబ్ అందుకున్నాడు షారూఖ్. ఆ తర్వాత విడుదలై డంకీ ఫర్వాలేదనిపించింది. SRK నటించిన పఠాన్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లు దాటిన మొదటి హిందీ చిత్రంగా నిలవగా, జవాన్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1148.32 కోట్లు వసూలు చేయడం అతడి స్థాయి తగ్గలేదని నిరూపణ అయింది. భారతీయ సినీపరిశ్రమలో అతడు నిజమైన బాక్సాఫీస్ కింగ్ అని నిరూపించగలిగాడు.
కొంత విరామం తర్వాత SRK తన తదుపరి చిత్రం 'కింగ్' లో నటించేందుకు సిద్ధమయ్యాడు. అయితే షారూఖ్ ప్రస్తుతం షూటింగ్ చేస్తున్నారా లేదా? అన్నదానిపై పూర్తి స్పష్ఠత లేదు. ఇలాంటి సమయంలో షారుఖ్ IIFA 2025 ఉత్సవాల గురించి మాట్లాడుతూ.. విలేకరుల సమావేశంలో తన కింగ్ సినిమా అప్ డేట్ మాట్లాడారు. నేను నా తదుపరి చిత్రం కింగ్ షూటింగ్‌ను ప్రారంభించబోతున్నాను అని ఖాన్ తెలిపారు.
యాక్షన్ చిత్రం కింగ్ షూటింగ్ మార్చి 2025లో ప్రారంభించనుండగా, సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించి, సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. 2026లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనేది ప్లాన్. అలాగే కింగ్ చిత్రంలో షారూఖ్ నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తారని సమాచారం. అలాగే అతడి కుమార్తె సుహానా ఖాన్ కూడా ఇందులో కీలక పాత్రను పోషించనుంది. సుహానా ఘనమైన పెద్ద తెర ఎంట్రీ గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
''నేను సినిమా షూటింగ్ మొదలుపెట్టే పనిలో ఉన్నాను కానీ IIFA 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోందని చెప్పారు గనుక నేను అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. నేను మార్చి 9న జైపూర్ అవార్డు కార్యక్రమంలో ఉండాలని ఆశిస్తున్నాను'' అని షారుఖ్ అన్నారు. తన చెంతనే ఉన్న కార్తీక్ ఆర్యన్ ని చూపిస్తూ.. ఐఫా 25వ సంవత్సరానికి హోస్ట్‌గా ఉండబోతున్నాడని చమత్కరించారు. నేను అతడికి బాధ్యతను అప్పగించాలంటే.. ఇస్కో మైన్ సీఖా దేతా హూం కి జైపూర్ మే షురుత్ కైసే కర్ని హై.. అని వ్యాఖ్యానించాడు. కార్తీక్ తో షారూఖ్ సరదా సంభాషణలు ఈ వేదికపై ఆకట్టుకున్నాయి.
2025 మార్చిలో రాజస్థాన్ జైపూర్‌లో ఐఫా ఉత్సవాలు జరగనున్నాయి. నేటి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో షారుఖ్ ఖాన్ -కార్తీక్ ఆర్యన్ లతో పాటు రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి శ్రీమతి దియా కుమారి, IIFA సహ వ్యవస్థాపకులు ఆండ్రీ టిమ్మిన్స్, విరాఫ్ సర్కారీ, సబ్బాస్ జోసెఫ్ కూడా పాల్గొన్నారు.