జవాన్, RRR ని బ్రేక్ చేస్తుందా?
ఇప్పుడు జవాన్ సినిమా కూడా వెయ్యి కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. మరో 120 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే వెయ్యి కోట్లు దాటిపోతుంది
By: Tupaki Desk | 20 Sep 2023 4:12 AM GMTబాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం జవాన్. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. రిలీజ్ అయిన అన్ని భాషలలో కూడా జవాన్ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అట్లీ మేకింగ్ స్టైల్, షారుఖ్ ఖాన్ స్క్రీన్ ప్రెజెన్స్, నయనతార, విజయ్ సేతుపతి లాంటి స్టార్ క్యాస్టింగ్ కి పెర్ఫెక్ట్ కమర్షియల్ స్టోరీలైన్ సెట్ కావడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
ఈ మూవీ ఇప్పటి వరకు 12 రోజుల్లో ఏకంగా 880 కోట్ల గ్రాస్ ని ప్రపంచ వ్యాప్తంగా సొంతం చేసుకుంది. ఇప్పట్లో సినిమాకి పోటీ ఇచ్చే స్థాయిలో కొత్త మూవీస్ ఏవీ కూడా రిలీజ్ కాలేదు. దీంతో జవాన్ మూవీ చూడటానికి ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో పఠాన్ సినిమాతో ఇప్పటికే షారుఖ్ ఖాన్ వెయ్యి కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకున్నాడు.
ఇప్పుడు జవాన్ సినిమా కూడా వెయ్యి కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. మరో 120 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే వెయ్యి కోట్లు దాటిపోతుంది. రెండు, మూడు రోజుల్లో ఆ మార్క్ ని అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. జవాన్ మూవీ ఇప్పటికే వరుస రికార్డులు ఉన్నాయి. బజరంగీ భాయ్ జాన్ మూవీ 910 గ్రాస్ కలెక్ట్ చేసి సల్మాన్ ఖాన్ కెరియర్ లో హైయెస్ట్ నెంబర్ గా ఉంది.
దీనిని జవాన్ బ్రేక్ చేయనుంది. తరువాత పఠాన్ 1050 కోట్ల కలెక్షన్స్ కి కూడా జవాన్ అధికమించి ఛాన్స్ కనిపిస్తోంది. కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1250 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. షారుఖ్ ఖాన్ దీనిని బీట్ చేయడానికి స్కోప్ ఉంది. హైయెస్ట్ కలెక్షన్స్ పరంగా నెంబర్ 3లో ఆర్ఆర్ఆర్ మూవీ ఉంది. ఈ సినిమా 1316 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా కలెక్ట్ చేసింది.
జవాన్ సినిమా ఆర్ఆర్ఆర్ మూవీ కలెక్షన్స్ రికార్డ్ ని కూడా అధికమించడానికి కావాల్సినంత ఛాన్స్ ఉంది. జవాన్ సూపర్ సక్సెస్ అయిన నేపథ్యంలో చైనా, జపానీస్ భాషలలో కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. అదే జరిగితే ఆర్ఆర్ఆర్ రికార్డులని జవాన్ అధికమించే అవకాశం ఉంటుంది. కలెక్షన్స్ పరంగా బాహుబలి 1810 కోట్లతో రెండో స్థానంలో ఉండగా దంగల్ 2024 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. వీటిని మాత్రం జవాన్ అందుకోలేకపోవచ్చు.