SRK కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన చిత్రం
తాజా కథనాల ప్రకారం 'జవాన్' రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ప్రేక్షకులకు ఇది ఒక అద్భుతమైన మాస్ యాక్షన్ ట్రీట్ కావాలని SRK ఇంత డబ్బును వెచ్చించాడు.
By: Tupaki Desk | 18 Aug 2023 1:30 AM GMTషారుఖ్ ఖాన్ 'పఠాన్'ను విజువల్ ఫీస్ట్ గా తెరకెక్కించేందుకు అత్యంత భారీ బడ్జెట్ ని వెచ్చించిన సంగతి తెలిసిందే. యష్ రాజ్ ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. అయితే పఠాన్ ని మించేలా ఇప్పుడు షారూఖ్ రెడ్ చిల్లీస్ జవాన్ చిత్రానికి బడ్జెట్ ని వెచ్చించడం హాట్ టాపిక్ గా మారింది.
కింగ్ ఖాన్ జవాన్ మొదటి ప్రకటన వచ్చినప్పటి నుండి నిరంతరం హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. 2023లో ఖాన్ కి ఇది రెండో విడుదల కానుంది. జవాన్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటి వరకు షారూఖ్ నటించిన అత్యంత ఖరీదైన చిత్రం అని టాక్ వినిపిస్తోంది. తాజా కథనాల ప్రకారం 'జవాన్' రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ప్రేక్షకులకు ఇది ఒక అద్భుతమైన మాస్ యాక్షన్ ట్రీట్ కావాలని SRK ఇంత డబ్బును వెచ్చించాడు. దర్శకుడు అట్లీ ట్రేడ్ మార్క్ మూవీ విజయంపై పూర్తి నమ్మకం ఉందని కూడా చెబుతున్నారు. పఠాన్ సక్సెస్ తర్వాత జవాన్ మరింత మెరుగ్గా ఉండాలని ఖాన్ భావించాడు. దానికి తగ్గట్టే హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు పెద్ద సెటప్‌లలో తెరకెక్కాయి. మరింత వాస్తవిక అనుభూతిని అందించడానికి పఠాన్‌కు భిన్నంగా గ్రీన్ మ్యాట్ (స్క్రీన్)ను తొలగించాలని చిత్రబృందం నిర్ణయించినట్టు తెలిసింది.
నిజానికి పఠాన్ 250 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందింది. ఈ చిత్రం అనేక రికార్డులను బద్దలు కొట్టింది. బాలీవుడ్ లో అత్యధిక గ్రాసర్ గా నిలిచింది. అలాగే ఈ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రం పఠాన్. అప్పటి వరకు 200 కోట్ల బడ్జెట్‌తో తీసిన జీరో ఖాన్ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ ఫిల్మ్. అంతకు ముందు రూ.135 కోట్లతో దిల్‌వాలే... రూ.130 కోట్ల బడ్జెట్‌తో రా.వన్. 150 కోట్ల బడ్జెట్‌తో హ్యాపీ న్యూ ఇయర్ టాప్ 5లో ఉన్నాయి. జవాన్ కోసం ఏకంగా 300కోట్ల బడ్జెట్ ని ఖర్చు చేయడం ఆసక్తికరం. ఇది బాహుబలి బడ్జెట్ కంటే ఎక్కువ.
యాక్షన్ థ్రిల్లర్ జవాన్‌లో షారుఖ్ ఖాన్‌తో పాటు నయనతార - విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించారు. ఇంకా ఈ చిత్రంలో దీపికా పదుకొణె, ప్రియమణి, సన్యా మల్హోత్రా, రిధి డోగ్రా తదితరులు నటించారు. ఈ చిత్రం 7 సెప్టెంబర్ 2023న విడుదల కానుంది.