షాకింగ్: సూపర్‌స్టార్ వైఫ్‌కి ED నోటీసులు
వేల కోట్ల ఆస్తులతో సువిశాల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి, సూపర్ కింగ్ డమ్ యజమానులుగా ఉన్నారు షారూఖ్ - గౌరీఖాన్ దంపతులు
By: Tupaki Desk | 19 Dec 2023 3:02 PM GMTవేల కోట్ల ఆస్తులతో సువిశాల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి, సూపర్ కింగ్ డమ్ యజమానులుగా ఉన్నారు షారూఖ్ - గౌరీఖాన్ దంపతులు. షారూఖ్ భారతదేశంలోనే అతి పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్. అతడి భార్య గౌరీఖాన్ ఇంటీరియర్ డిజైనర్ గా సినీనిర్మాతగాను సుపరిచితురాలు. సందపల సృష్టిలో బాద్ షాకి ఏమాత్రం తీసిపోని ప్రతిభ గౌరీఖాన్ సొంతం. ఇటీవల గౌరీఖాన్ సహనిర్మాతగా కొనసాగిన పఠాన్ - జవాన్ చిత్రాలు వెయ్యి కోట్ల క్లబ్ వసూళ్లతో సంచలనం సృష్టించాయి. ఇప్పుడు షారూఖ్ నటించిన డంకీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇలాంటి సమయంలో ఊహించని విధంగా ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి గౌరీఖాన్ కి నోటీసులు అందడం షాకిస్తోంది.
వరుసగా రెండు వెయ్యి కోట్ల క్లబ్ సినిమాలు నిర్మించినందున ఆదాయ లెక్కలు చెప్పని గౌరీఖాన్ కి నోటీసులు అందాయని అంతా భావించారు. కానీ ఈడీ నోటీసులు ఇందుకు రాలేదని తెలిసింది. దీనికి ఒక ప్రత్యేక డీల్ కారణం. రూ. 30 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లక్నో రియల్ ఎస్టేట్ కంపెనీ తులసియానీ గ్రూప్ కి బ్రాండింగ్ చేస్తున్నందున గౌరీకి ED నోటీసులు పంపింది. గౌరీ ప్రచారకర్తగా ఉన్న కంపెనీ దుష్ప్రవర్తను ఈ నోటీసులు సర్వ్ చేసారని టాక్ వినిపిస్తోంది.
అయితే వేల కోట్ల ఆస్తులు ఉన్న గౌరీఖాన్-షారూఖ్ దంపతులపై చాలా కాలంగా ఈడీ కన్ను ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. పఠాన్ - జవాన్ - డంకీ సినిమాల సక్సెస్ లు అయినా వాటితో ఎన్ ఫోర్స్ మెట్ కి ఎలాంటి సంబంధం లేదు. పఠాన్ - జవాన్ చిత్రాల ఫేక్ కలెక్షన్లను ప్రచారం చేసినందుకు ఇప్పుడిలా ఈడీ వెంటపడుతోందంటూ కొందరు నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. డంకీకి కార్పొరెట్లు వీక్షించేందుకు బల్క్ బుకింగులు చేసినందుకు కూడా ఈ నోటీసులు అంది ఉంటాయని కొందరు సెటైర్లు వేస్తున్నారు. అయితే గౌరీఖాన్ కి నోటీసులు అందడం వెనక మతలబ్ వేరే ఉంది. రియల్ కంపెనీకి ప్రమోటర్ గా ఉండడం వల్లనే గౌరీఖాన్ కి నోటీసులు అందాయి. ఆ మేరకు నోటీసుల్లో స్పష్ఠత ఉన్నట్టు తెలిసింది.