Begin typing your search above and press return to search.

రాజమౌళి క్రష్ తో ఏమన్నాడో తెలుసా..?

రాజమౌళి ఇలా ఒక అమ్మాయితో మాట్లాడేందుకు అంతగా భయపడ్డాడా అని అందరు షాక్ అవుతున్నారు.

By:  Tupaki Desk   |   15 Dec 2024 6:44 AM GMT
రాజమౌళి క్రష్ తో ఏమన్నాడో తెలుసా..?
X

దర్శక ధీరుడు రాజమౌళి తన సినిమాలతో రికార్డుల మీద రికార్డులు కొడుతుంటాడు. ఆయన సినిమా తీస్తే సూపర్ హిట్ అనిపించేలా చేస్తూ వచ్చాడు. బాహుబలితో పాన్ ఇండియా, ఆర్.ఆర్.ఆర్ తో పాన్ వరల్డ్ ని టచ్ చేశాడు. ఇక రాబోతున్న మహేష్ సినిమాతో హాలీవుడ్ ని టార్గెట్ పెట్టుకున్నాడు. మహేష్ సినిమా పనుల్లో బిజీ బిజీగా ఉన్న రాజమౌళి లేటెస్ట్ గా రానా దగ్గుబాటి షోలో స్పెషల్ చిట్ చాట్ లో పాల్గొన్నాడు.

రాజమౌళి గురించి ఆయన చిన్ననాటి విషయాల గురించి ఎన్నో ఈ ఇంటర్వ్యూలో రాబట్టే ప్రయత్నం చేశాడు రానా. ఐతే ఇందులో భాగంగా రాజమౌళి క్రష్ గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసాడు. తన ఇంటర్మీడియట్ లో క్రష్ ఉండేదని ఆ విషయం క్లాస్ మొత్తం తెలుసని అన్నారు రాజమౌళి. ఆమెతో మాట్లాడారా అని రానా అడిగితే.. అందరి బలవంతం చేస్తే ఒకసారి ధైర్యం చేసి మాట్లాడా అని అన్నారు. ఇంతకీ ఏమని అడిగారు అంటే ట్యూషన్ ఫీజు కట్టావా అని అడిగానని అన్నారు రాజమౌళి.

రాజమౌళి ఆ మాట చెప్పడంతో రానా నవ్వేశాడు. అమ్మాయిల విషయంలో తాను ఎంత భయం, షై ఫీలవుతాడో రాజమౌళి ఈ విషయం ద్వారా చెప్పారు. ఐతే డైరెక్టర్ గా తాను అనుకున్న షాట్ పర్ఫెక్ట్ గా రావడం కోసం తను కష్టపడుతూ నటీనటులను కస్టపెట్టే రాజమౌళి ఇలా ఒక అమ్మాయితో మాట్లాడేందుకు అంతగా భయపడ్డాడా అని అందరు షాక్ అవుతున్నారు.

రాజమౌళి గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను రానా దగ్గుబాటి స్పెషల్ చిట్ చాట్ లో వెల్లడించారు. రాజమౌళి చేయబోతున్న మహేష్ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఈ సినిమా విషయంలో జక్కన్న ప్లానింగ్ అంతా నెక్స్ట్ లెవెల్ లో ఉందని తెలుస్తుంది. సినిమా నిర్మాణంలో హాలీవుడ్ ప్రొడక్షన్ కూడా భాగం అవుతుందని టాక్.

ఇప్పటికే మహేష్ కోసం రాజమౌళి హీరోయిన్స్ వేట మొదలు పెట్టారు. హాలీవుడ్ కథానాయికను తీసుకొస్తారని టాక్ రాగా లేటెస్ట్ గా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ షిఫ్ట్ అయిన ప్రియాంక చోప్రాని మహేష్ తో జత కట్టేలా చేస్తారని చెబుతున్నారు. ఐతే హీరోయిన్ ఎంపిక మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎంపికపై ఫైనల్ డెసిషన్ జరగలేదని తెలుస్తుంది.