Begin typing your search above and press return to search.

SSMB29: మహేశ్ మూవీలో రాజమౌళి సోదరుడు!

సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్ లో ఓ భారీ సినిమా తెరకెక్కనుంది.

By:  Tupaki Desk   |   7 Aug 2024 12:30 PM GMT
SSMB29: మహేశ్ మూవీలో రాజమౌళి సోదరుడు!
X

సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్ లో ఓ భారీ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందించనున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయినట్లుగా తెలుస్తోంది. రాజమౌళి తండ్రి కె.వి. విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. అయితే ఆయనతో పాటుగా మరో రచయిత కూడా ఈ స్టోరీ మీద పని చేసినట్లుగా తెలుస్తోంది.

'స్టూడెంట్ నెం.1' మినహా రాజమౌళి తెరకెక్కించిన అన్ని సినిమాలకు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారని అందరూ అనుకుంటారు. కానీ మధ్యలో వచ్చిన 'మర్యాద రామన్న' చిత్రానికి జక్కన్న సోదరుడు ఎస్.ఎస్. కాంచి స్టోరీ ఇచ్చారనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. గత కొన్నేళ్లుగా రాజమౌళి సినిమాల రైటింగ్ డిపార్ట్మెంట్ లో భాగం అవుతూ వస్తున్న కాంచి.. ఇప్పుడు 'SSMB 29' స్క్రిప్ట్ మీద కూడా వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

మహేష్ బాబు కోసం ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌ అడ్వెంచర్ స్టోరీ రెడీ చేస్తున్నట్లు విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. అయితే ఈ స్టోరీ ఐడియా వెనుక ఎస్ఎస్ కాంచి ఉన్నారట. ఆయ‌న చెప్పిన పాయింట్ ఆధారంగానే 'బాహుబలి' రచయిత ఈ అడ్వెంచ‌ర్ క‌థను రెడీ చేసినట్లుగా టాక్. ఈ స్క్రిప్టు వెనుక కాంచి ఆలోచ‌న‌లు, సూచ‌న‌లు ఉన్నాయ‌ని అంటున్నారు. దీనికి ఆఫ్రికన్-బ్రిటీష్ రచయిత విల్బర్ స్మిత్ రాసిన నవలలను స్ఫూర్తిగా తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

రచయిత శివశ్రీ కాంచి నటుడిగా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. 'సింహాద్రి', 'సై' లాంటి సినిమాల్లో కామెడీ రోల్స్ చేశారు. కెరీర్ ప్రారంభంలో ఆయన కె. రాఘవేంద్రరావు దగ్గర సుందరకాండ, అల్లరి ప్రియుడు, మేజర్ చంద్రకాంత్, ముద్దుల ప్రియుడు వంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేశారు. ఆ తర్వాత నిర్మాత గుణ్ణం గంగరాజుతో ఏర్పడిన అనుబంధంతో.. జస్ట్ ఎల్లో మీడియా బ్యానర్ లో తెలుగు టీవీ చరిత్రలో నిలిచిపోయే 'అమృతం' వంటి బ్లాక్ బస్టర్ సిరీస్ ను రూపొందించారు.

"అమృతం" సీరియల్‌ కి రచయితగా, దర్శకుడిగా, నటుడిగా తన సహకారం అందించారు ఎస్ఎస్ కాంచి. మొదటి 50 ఎపిసోడ్‌లు రాయడమే కాదు, 40 ఎపిసోడ్‌లకు దర్శకత్వం వహించారు కూడా. ఆ తర్వాత 80వ ఎపిసోడ్ వరకూ నటుడిగా కొనసాగారు. ఇందులో ఆయన పోషించిన అంభుజం పాత్ర మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇక కె.వి.విజయేంద్ర ప్రసాద్‌ తో కలిసి అనేక చిత్రాలకు రచయితగా, స్క్రిప్ట్ కోఆర్డినేటర్ గా, స్క్రీన్ ప్లే రైటర్ గా వర్క్ చేశారు.

రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, ఈగ, RRR వంటి చిత్రాలకు ఎస్.ఎస్ కంచి వర్క్ చేశారు. 'ఏమో గుర్రం ఎగరావచ్చు' అనే చిత్రానికి స్టోరీ డైలాగ్స్ అందించడమే కాదు.. విజయేంద్ర ప్రసాద్‌ దర్శకత్వం వహించిన 'శ్రీ కృష్ణ 2006' సినిమాకి స్క్రీన్ ప్లే కూడా రాశారు. అలానే మెగా ఫోన్ పట్టి 'షో టైమ్' అనే చిత్రానికి డైరెక్షన్ చేశారు. ఇప్పటి మహేష్ బాబుతో జక్కన్న చేస్తున్న ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ లోనూ కాంచీ భాగం అవుతున్నారని తెలుస్తోంది.