Begin typing your search above and press return to search.

మహేష్- రాజమౌళి మూవీ.. టార్గెట్ ఫిక్స్ చేసేదెవరు?

ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో మూవీ రూపొందుతున్నట్లు ప్రచారం జరుగుతుండగా.. మహేష్ ను నెవ్వర్ బిఫోర్ అనేలా చూపించనున్నారని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   29 Nov 2024 2:30 AM GMT
మహేష్- రాజమౌళి మూవీ.. టార్గెట్ ఫిక్స్ చేసేదెవరు?
X

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ప్రేక్షకుల ముందుకు రానున్న పాన్ ఇండియా మూవీ SSMB29పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. అవి చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి తర్వాత రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని సమాచారం.

ప్రస్తుతం మహేష్ బాబు తనను తాను మేకోవర్ చేసుకుంటున్నారు. ప్రాజెక్ట్ చర్చల్లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో రాజమౌళి.. వర్క్ షాపులు నిర్వహిస్తున్నారు. మెయిన్ క్యాస్టింగ్ సెలక్షన్ కోసం చర్చలు జరుపుతున్నారు. రీసెంట్ గా షూటింగ్ లొకేషన్స్ ను పరిశీలించి ఫిక్స్ చేసిన వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే అన్ని విషయాలు ప్రకటించనున్నారని ప్రచారం సాగుతోంది.

ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో మూవీ రూపొందుతున్నట్లు ప్రచారం జరుగుతుండగా.. మహేష్ ను నెవ్వర్ బిఫోర్ అనేలా చూపించనున్నారని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. 2027లో మూవీ వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉండగా.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ కొత్త చర్చ మొదలైంది.

SSMB 29 ప్రాజెక్ట్ కు బాక్సాఫీస్ టార్గెట్ ను ఎవరు సెట్ చేస్తారోనని ఇప్పుడు నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన ఫస్ట్ తెలుగు డైరెక్టర్ గా రాజమౌళి అన్న విషయం తెలిసిందే. ఆయన తెరకెక్కించిన బాహుబలి-2 రూ.1700 కోట్లకు పైగా రాబట్టగా.. ఆర్ఆర్ఆర్ రూ.1250 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.

రాజమౌళి తర్వాత రూ.1000 కోట్ల క్లబ్ లోకి వెళ్లాలని అంతా ట్రై చేస్తుండగా.. రీసెంట్ గా కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ అడుగుపెట్టారు. ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప-2 వెయ్యి కోట్ల మార్క్ టచ్ చేస్తుందని అంతా అంచనా వేస్తున్నారు. అయితే SSMB 29 సినిమాకు రాజమౌళి రూ.1000 కోట్లనే టార్గెట్ గా పెట్టుకుని ఉంటారని చెబుతున్నారు నెటిజన్లు.

కానీ ఆ సినిమాకు ముందు పలు భారీ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. టాలీవుడ్ కు చెందిన అనేక మంది హీరోలు మ్యాసివ్ చిత్రాలతో సందడి చేయనున్నారు. అందుకే SSMB 29 కన్నా ముందు వచ్చిన సినిమాలు రూ.1000 కోట్లకు పైగా సాధిస్తే.. అదే రాజమౌళి టార్గెట్ అవుతుందని, దానిని బ్రేక్ చేయాలని అనుకుంటారని అభిప్రాయపడుతున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో..