Begin typing your search above and press return to search.

SSMB 29.. వందల ఏళ్ల క్రితం స్టోరీతో..

అయితే రాజమౌళి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగా.. మహేష్ బాబు తనను తాను మేకోవర్ చేసే పనిలో ఉన్నారు.

By:  Tupaki Desk   |   13 Sep 2024 7:46 AM GMT
SSMB 29.. వందల ఏళ్ల క్రితం స్టోరీతో..
X

SSMB 29.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ పై ఎలాంటి అంచనాలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూవీ ప్రకటన తప్ప ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా రాకపోయినా.. సినీ ప్రియులు వేరే లెవెల్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అప్డేట్స్ కోసం అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఆ సినిమాకు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా.. క్షణాల్లో వైరల్ అయిపోతుంటుంది.

అయితే రాజమౌళి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగా.. మహేష్ బాబు తనను తాను మేకోవర్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే మహేష్ న్యూ లుక్స్ తో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. లాంగ్ హెయిర్, ఫుల్ గడ్డంతో తాజాగా కూడా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో సూపర్ స్టార్ తళుక్కుమన్నారు. దీంతో సినిమాలో మునుపెన్నడూ చూడని లుక్ లో సందడి చేయనున్నట్లు ఈజీగా అర్థమైపోతుంది. మహేష్ పై రీసెంట్ రెండు సార్లు ఫోటో షూట్ కూడా జరిగినట్లు టాక్.

కానీ సినిమాకు సంబంధించి ఎలాంటి వివరాలు లీక్ అవ్వకుండా రాజమౌళి చాలా జాగ్రత్త పడుతున్నారు. త్వరలోనే ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు క్లియర్ గా చెప్పనున్నారట. అయితే SSMB 29 మూవీ.. అడవుల నేపథ్యంలో సాగనున్నట్లు ఇప్పటికే కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో లీక్ చేశారు. ఇప్పుడు జక్కన్న- మహేష్ మూవీ.. 18వ శతాబ్దపు బ్యాక్ డ్రాప్ తో రూపొందనుందని సినీ ఇండస్ట్రీలో జోరు ప్రచారం సాగుతోంది.

కొన్ని వందల ఏళ్ల క్రితం నాటి బ్యాక్ డ్రాప్ స్టోరీతో పీరియాడిక్ డ్రామాగా మూవీ ఉంటుందట. సినిమాలో 200 మందికి పైగా ఆర్టిస్టులు భాగమవ్వనున్నట్లు తెలుస్తోంది. అనేక ఏళ్ల క్రితం స్టోరీ కావడంతో.. గిరిజన జాతికి సంబంధించిన లుక్స్ ను రాజమౌళి పరిశీలిస్తున్నారని సమాచారం. అప్పటి వాతావరణం.. ఆడియన్స్ కు కళ్లకు కట్టినట్లు చూపించే విధంగా సెట్స్ వేసేందుకు డిజైన్స్ రూపొందుతున్నాయని టాక్. త్వరలో వాటిని రాజమౌళి ఫైనల్ చేయనున్నారని వినికిడి.

ఇప్పటికే వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులకు ట్రైనింగ్ స్టార్ట్ అయిందట. షూట్ ప్రారంభమయ్యే ముందు వారి లుక్స్ ను ఫిక్స్ చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి.. మూవీ షూటింగ్ కు అనువైన ప్రదేశాలు ఫిక్స్ చేసేందుకు వరల్డ్ వైడ్ గా పర్యటిస్తున్నారు. ఇప్పటికే నటీనటులను లాక్ చేసేశారని తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. మరి జక్కన్న.. మూవీకి సంబంధించిన విషయాలు ఎప్పుడు అనౌన్స్ చేస్తారో వేచి చూడాలి.