ఎస్ ఎస్ ఎంబీ 29 గురించి అలా అనుకుంటే పొరపాటేనా!
'బాహుబలి' తర్వాత 'ఆర్ ఆర్ ఆర్' పట్టాలెక్కించడానికి...రిలీజ్ చేయడానికి కూడా చాలా సంవత్సరాలే సమయం పట్టింది.
By: Tupaki Desk | 20 March 2025 7:00 AM'బాహుబలి' నుంచి రాజమౌళి సినిమా షూటింగ్ లు పూర్తి చేసుకుని రిలీజ్ అవ్వడం అన్నది సంవత్స రాలు పడుతోన్న సంగతి తెలిసిందే. ఒక్కో ప్రాజెక్ట్ ని పూర్తి చేసి రిలీజ్ చేయడానికి ఎలా లేదన్నా రెండేళ్లు పడుతుంది. ఇంకా అంతకన్నా ఎక్కువ సమయమే తీసుకుంటారు. 'బాహుబలి' తర్వాత 'ఆర్ ఆర్ ఆర్' పట్టాలెక్కించడానికి...రిలీజ్ చేయడానికి కూడా చాలా సంవత్సరాలే సమయం పట్టింది.
అయితే ఎస్ ఎస్ ఎంబీ 29 విషయంలో అంత సమయం పట్టదని ఏడాదిన్నరలోనే సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్ అయిపోతుందని తొలి నుంచి జోరుగా ప్రచారం సాగుతుంది. అందుకు తగ్గట్టు రాజమౌళి వేసిన షెడ్యూల్స్ కూడా వేగంగా పూర్తవ్వడంతో ఇదంతా ఆ ప్రచారమంతా నిజమయ్యేలా ఉందంటూ అభిమానులు ఆశలు పెంచుకుంటున్నారు. హైదరాబాద్...ఒడిశా షెడ్యూల్స్ చాలా వేగంగా పూర్తి చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈసారి మాత్రం రిలీజ్ అనుకున్న సమయానికి వచ్చేస్తుందని భావిస్తున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్దది? అని అంచనా వేయగలిగేది ఎంత మంది. ఈ సినిమాతో రాజమౌళి పాన్ వరల్డ్ మార్కెట్ పైనే గురి పెట్టాడు. ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్ తోనే పాన్ ఇండియాని ఊపేసారు. అలాంటి జక్కన్న దృష్టిలో మహేష్ ఇమేజ్ తో పాన్ వరల్డ్ తప్ప మరో ఆలోచన లేదు ? అన్నది కాదనలేని నిజం.
విజయేంద్ర ప్రసాద్ పాన్ వరల్డ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని రాసిన కథ అని ఇప్పటికే లీకులం దుతున్నాయి. రెండు భాగాలుగానూ తెరకెక్కిస్తున్నారు అని వినిపిస్తుంది. అలాంటప్పుడు మొదటి భాగాన్ని ఏడాదిన్నరలో అన్ని పనులు పూర్తి చేసి రిలీజ్ చేయడం అన్నది అసాధ్యమంటున్నారు. సినిమా రిలీజ్ కి రెండేళ్లకు పైగానే సమయం పడుతుందని తాజా సమాచారం.