1000 కోట్ల బడ్జెట్.. లాక్ చేసుకోవచ్చా..?
ఐతే మహేష్ రాజమౌళి సినిమా బడ్జెట్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో చర్చ నడుస్తుంది.
By: Tupaki Desk | 28 Oct 2024 11:30 AM GMTRRR తర్వాత రాజమౌళి మహేష్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ డాషింగ్ లుక్ తో కనిపించనున్నారు. మహేష్ తో రాజమౌళి చేస్తున్న సినిమా పాన్ వరల్డ్ లెవెల్ లో ఉండబోతుందని టాక్. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ సినిమా విషయంలో ప్రతి విషయం చాలా ఫోకస్ తో పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. ఇప్పటికే సినిమా కోసం మహేష్ తన లుక్ మొత్తం మార్చేశాడు. ఇక ఈ సినిమా బడ్జెట్ విషయంపై లేటెస్ట్ గా ఒక టాక్ వినిపిస్తుంది.
ప్రస్తుతం సినిమాకు లొకేషన్స్ వేటలో ఉన్న రాజమౌళి అండ్ టీం సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని దాదాపు పూర్తి చేసినట్టే అని చెప్పుకుంటున్నారు. 2025 జనవరి నుంచి సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఆయనతో పాటు హాలీవుడ్ ప్రొడక్షన్ నుంచి కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం ఉంటుందని టాక్.
ఐతే మహేష్ రాజమౌళి సినిమా బడ్జెట్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో చర్చ నడుస్తుంది. సినిమా బడ్జెట్ గా 900 నుంచి 1000 కోట్ల దాకా బడ్జెట్ కేటాయిస్తున్నట్టు టాక్. తెలుగు సినిమా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో 500 కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన కల్కి సినిమా 500 నుంచి 600 కోట్ల దాకా బడ్జెట్ అయ్యింది. ఇక ఇప్పుడు రాజమౌళి మహేష్ సినిమా దానికి మించి దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నారట.
సో ఈ లెక్కన చూస్తే జక్కన్న ఈసారి భారీ స్కెచ్చే వేసినట్టు అనిపిస్తుంది. 1000 కోట్ల సినిమా అంటే హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తగ్గని విధంగా ఎస్.ఎస్.ఎం.బి 29 సినిమా ఉంటుందని చెప్పొచ్చు. గుంటూరు కారం సినిమా వరకు కేవలం తెలుగు సినిమాలే చేస్తూ వచ్చిన మహేష్ ఒకేసారి పాన్ వరల్డ్ సినిమాతో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ని షేక్ చేయనున్నాడు.
ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనున్న ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో వస్తున్నాడు రాజమౌళి. సినిమా బడ్జెట్ వింటేనే గూస్ బంప్స్ వస్తుంటే ఇక సినిమాను రాజమౌళి ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు అన్నది ఊహించుకుంటేనే బాబోయ్ అనిపించేస్తుంది. ఏది ఏమైనా రాజమౌళితో మహేష్ సినిమా కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ అందరికీ మర్చిపోలేని ఒక హిస్టరీ క్రియేట్ చేసే రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే సినిమా ఇస్తున్నారు.
ఈ సినిమాకు సంబందించిన మిగతా కాస్ట్ ఇంకా టెక్నికల్ టీం ని కూడా ఎంపిక చేసుకుంటున్నారు రాజమౌళి. అది పూర్తవ్వగానే జనవరి నుంచి సినిమా రెగ్యులర్ షూట్ ఉంటుందని తెలుస్తుంది.