SSMB29 లీక్.. కావాలనే చేశారా?
సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం SSMB29 పై భారీ అంచనాలు ఉన్నాయి.
By: Tupaki Desk | 10 March 2025 10:06 AM ISTసూపర్ స్టార్ మహేశ్ బాబు, ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం SSMB29 పై భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ఈ సినిమాపై క్రేజ్ ఉండగా, రీసెంట్‌గా ఊహించని లీక్ ఘటన చిత్ర యూనిట్‌ను షాక్‌కు గురిచేసింది. ఓడిశాలోని కోరాపుట్ ప్రాంతంలో జరుతున్న షూటింగ్ నుంచి ఓ వీడియో బయటికి రావడం, అది సోషల్ మీడియాలో వైరల్ కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మహేశ్ బాబు ఒక రోల్ చెయిర్‌లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్లి, ముందుకు సాగుతున్న సన్నివేశం లీకైనట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు రాజమౌళి సినిమాలకు సంబంధించి కొన్ని లీక్ ఘటనలు జరిగినా, ఈ స్థాయిలో షూటింగ్ ప్రారంభ దశలోనే బయటపడడం ఇదే తొలిసారి. గతంలో బాహుబలి నుండి కొన్ని ఫోటోలు, RRR లోని కొన్ని స్టిల్‌లు బయటికి వచ్చినా, రాజమౌళి వెంటనే వాటిని కంట్రోల్ చేశారు. కానీ ఈసారి SSMB29 షూటింగ్ వీడియో లీక్ కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రాజమౌళి తన సినిమాలకి అత్యంత కట్టుదిట్టమైన భద్రతను కల్పించే దర్శకుల్లో ఒకరు. అంతగా జాగ్రత్తగా ఉండే దర్శకుడి ప్రాజెక్ట్‌కి ఇలా లీక్‌లు కావడం నిజంగా అనూహ్యమైన విషయం.
అయితే ఈ లీక్ కావాలని జరిగిందా? లేక అనుకోకుండా జరిగిపోయిందా? అనే విషయంలో సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ‘రాజమౌళికి లీక్స్ వస్తాయని తెలియకుండా ఉంటుందా?’, ‘ఇలాంటి ప్రాజెక్ట్‌కి ఇంత తక్కువ సెక్యూరిటీ ఎలా?’ అంటూ చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో ‘ఇది కావాలని టీమ్ ప్లాన్ చేసిన బజ్ క్రియేషన్..’ అనే వాదన వినిపిస్తోంది.
అయితే దీనికి కౌంటర్‌గా మరో వర్గం ‘రాజమౌళికి బజ్ కోసం లీక్స్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆయన సినిమా అంటేనే భారీ స్థాయిలో చర్చ జరుగుతుంది’ అంటూ సమాధానం ఇస్తోంది. ఈ లీక్ తర్వాత రాజమౌళి టీమ్ భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా ప్రధాన పాత్రల్లో మహేశ్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మరికొంతమంది టాప్ స్టార్లు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవ్వనున్నట్లు సమాచారం. అయితే ఇలాంటి లీక్‌లు కథ విషయంలో ఆసక్తిని తగ్గించే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ లీక్‌పై రాజమౌళి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి కఠినమైన నాన్-డిస్క్లోజర్ అగ్రిమెంట్‌లు పెట్టారని, అయినప్పటికీ ఈ ఘటన జరగడం ఆయనను ఆశ్చర్యానికి గురిచేసిందని సమాచారం. SSMB29 ఒక భారీ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందుతుండగా, వచ్చే నెలల్లో మరిన్ని కీలక అప్‌డేట్స్ రానున్నాయి. అయితే ఈ లీక్ జరిగిన నేపథ్యంలో టీమ్ భద్రతను మరింత కఠినతరం చేస్తుందా? లేక ఏమైనా అధికారిక ప్రకటన వస్తుందా? అన్నది చూడాలి.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 2027లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోందనే టాక్ వస్తోంది. కానీ ఇప్పుడే ఇలాంటి లీక్‌లు వస్తే, ఇంకా షూటింగ్ జరగాల్సిన మూడు సంవత్సరాల్లో మరెన్ని రకాల అపోహలు క్రియేట్ అవుతాయో అనే టెన్షన్ యూనిట్‌లో నెలకొంది. ఇకపై రాజమౌళి టీమ్ మరింత స్పెషల్ కేర్ తీసుకోవాల్సిందే..