రెండేళ్లు మహేష్ కి వనవాసం తప్పదు!
# ఎస్ ఎస్ ఎంబీ 29 షూటింగ్ ఒడిశాలో జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజమౌళి అండ్ కో స్పాట్ కు చేరుకుని కీలక నటులపై షూటింగ్ మొదలు పెట్టారు.
By: Tupaki Desk | 7 March 2025 12:38 PM IST# ఎస్ ఎస్ ఎంబీ 29 షూటింగ్ ఒడిశాలో జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజమౌళి అండ్ కో స్పాట్ కు చేరుకుని కీలక నటులపై షూటింగ్ మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా సూపర్ స్టార్ మహేష్ కూడా బుధవారం ఒడిశాకు చేరుకున్నారు. అనంతరం దేవ్ మాలి పర్వతంపై బస చేసే ప్రాంతానికి వెళ్లారు. ఆయనతో పాటు వెంట మలయాళం హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ కూడా ఉన్నారు.
ఈ చిత్రంలో పృధ్వీరాజ్ నటిస్తున్నాడా? లేదా? అని ఇంత వరకూ సందేహాలుండేవి. తాజాగా ఒడిశాలో ఆయన కూడా కనిపించడంతో పృథ్వీ ఎంట్రీ కూడా కన్పమ్ అయింది. ఈనెల 28 వరకూ తోలోమాలి, దేవ్ మాలి, మాచ్ ఖండ్ ప్రాంతాల్లో ఎంపిక చేసిన లొకేషన్లలో షూటింగ్ జరుతుంది. తోలోమాలి ప్రాంతంపై ఇప్పటికే చిత్రీకరణ కోసం ప్రత్యేకమైన సెట్లు కూడా వేసారు. మరికొన్ని రోజుల్లో మిగతా నటీనటులు కూడా స్పాట్ కి చేరుకోనున్నారు.
మహేష్ ఇలా అడవుల బాట పట్టడం అన్నది చాలా సంవత్సరాలకు జరుగుతోంది. గతలో సైనికుడు సినిమాలో ఓ యాక్షన్ సన్నివేశం కోసం కొన్ని వారాల పాటు ఓ ఏజెన్సీ కొండ, గుట్టల లోయ ప్రాంతంలో షూటింగ్ చేసారు. మహేష్ అడవులకు వెళ్లడం అదే తొలిసారి. ఆ తర్వాత ఏ సినిమా షూటింగ్ కి అడవుల్లోకి వెళ్లలేదు. మళ్లీ రాజమౌళి కారణంగా అడవుల బాట పట్టాల్సి వచ్చింది.
ఈ సారి సినిమా మొదలు నుంచి ముగింపు వరకూ మహేష్ కి వనవాసం తప్పదు. ఎందుకంటే ఈ సినిమా కథ అలాంటింది. ఇదొక అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం. ఆఫ్రికా అడవుల నేపథ్యంతో కూడిన కథ ఇది. దీనిలో భాగంగా ఆఫ్రికాలోనూ చాలా భాగం షూటింగ్ చేస్తారు. ఇప్పటికే కెన్యా లో కొన్ని లొకేషన్లు ఫైనల్ అయిన సంగతి తెలిసిందే. ఒడిశా షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఆఫ్రికాకి వెళ్లే అవకాశం ఉంది. అలాగే రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేసినా? అందులోనూ అంతా అడవే. అక్కడ ఉన్నఅడవినే కాకుండా...అడవి నేపథ్యంలో భారీ సెట్లు కూడా సినిమా కోసం నిర్మిస్తున్నారు. ఆ రకంగా సినిమా పూర్తయ్యే వరకూ మహేష్ కి వనవాసం తప్పదు.