Begin typing your search above and press return to search.

మ‌హేష్ పాన్ ఇండియా సంద‌డి ఆరోజు నుంచేనా?

ఎస్ ఎస్ ఎంబీ 29వ చిత్రం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియాలో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిం దే.

By:  Tupaki Desk   |   17 Sep 2024 5:21 AM GMT
మ‌హేష్ పాన్ ఇండియా  సంద‌డి ఆరోజు నుంచేనా?
X

# ఎస్ ఎస్ ఎంబీ 29వ చిత్రం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియాలో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రెండేళ్ల కాలంగా ఇదే ప్రాజెక్ట్ జై జ‌క్క‌న్న అండ్ కో ప‌నిచేస్తున్నారు. మ‌హేష్ లుక్ టెస్ట్ ..పాత్ర‌కు అవ‌స‌ర‌మైన ట్రైనింగ్ అన్ని పూర్త‌య్యాయి. కొన్ని నెల‌లుగా మ‌హేష్ లాంగ్ హెయిర్ లోనే క‌నిపి స్తున్నాడు. బ‌య‌ట‌కు ఎక్క‌డ‌కు వెళ్లినా ఇదే గెట‌ప్ లో క‌నిపిస్తున్నాడు.

దీంతో అదే హెయిర్ స్టైల్ సినిమాలో క‌నిపిస్తాడ‌ని అంతా భావిస్తున్నారు. కానీ దీన్ని అంగీక‌రించ‌డానికి అవ‌కాశం లేదు. రాజమౌళి త‌న హీరోలుక్ ని అంతా బాహాటంగా ముందే రివీల్ చేయ‌డు. దానికంటూ ప్ర‌త్యేక‌మైన ఓ సంద‌ర్భం ఉంటుంది. హీరో లుక్ అంటే ఓ క్రేజ్ తో బ‌య‌ట‌కు రావాలి. అందుకు జ‌క్క‌న్న ప్లానింగ్ వేరే ఉంటుంది. ఇంకా టైటిల్ ప్ర‌క‌ట‌న ఇదంతా సినిమా మొద‌లైన త‌ర్వాత ఆలోచించాల్సిన విష‌యం.

ద‌స‌రా సంద‌ర్భంగా ఓ బిగ్ అప్ డేట్ వ‌స్తుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. మ‌రి వారి కోరిక మ‌న్నించి ఏదైనా అప్ డేట్ ఇస్తారా? అన్న‌ది చూడాలి. టైటిల్...సినిమాలో ఇత‌ర న‌టీన‌టుల వివ‌రాలు ప్ర‌క‌టిస్తార‌ని గెస్ చేస్తున్నారు. మ‌రేం జ‌రుగుతుందో చూడాలి. ఇక వచ్చే ఏడాది మొదట్లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారం భించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు స‌మాచారం. వివిధ అంతర్జాతీయ ప్రదేశాలలో చిత్రీక‌ర జ‌ర‌పాల‌ని భావిస్తున్నారుట‌.

అలాగే రామోజీ ఫిల్మ్ సిటీలో అనేక గ్రాండ్ సెట్‌లు నిర్మాణం జ‌రుగుతుందిట‌. ఆప్రిక‌న్ అడ‌వుల బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ అని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఈ క‌థ‌కి ఇంకా పౌరాణాళి అంశా ల్ని ముడిపెట్టి రాసిన‌ట్లు వినిపిస్తుంది. కానీ దీని గురించి ఎలాంటి అధికారిక స‌మాచారం లేదు. ఫ‌స్ట్ క్లాస్ టెక్నీషియ‌న్లు ఈ సినిమాకి ప‌నిచేస్తున్నారు. పి.ఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

సాధార‌ణంగా రాజ‌మౌళి కెమెరా మ్యాన్ అంటే సెంథిల్ కుమార్ ఉంటాడు. కానీ ఈసారి అత‌డిని ప‌క్క‌న‌బెట్టి వినోద్ ని రంగంలోకి దించడం విశేషం. అలాగే సంగీతం య‌ధావిధిగా కీరవాణి అందిస్తున్నారు. కెఎల్ నారాయణ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. 1000 కోట్లు బ‌డ్జెట్ అని ప్ర‌చారంలో ఉంది.