Begin typing your search above and press return to search.

SSMB 29లో ప్రియాంక.. అసలెందుకీ గుసగుస?

మహేష్ కన్నా ప్రియాంక వయసు తక్కువే అయినా.. వేరే హీరోయిన్ ను తీసుకుంటే బాగుండేదని అంటున్నారు.

By:  Tupaki Desk   |   26 Jan 2025 6:29 AM GMT
SSMB 29లో ప్రియాంక.. అసలెందుకీ గుసగుస?
X

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబోలో యాక్షన్ అడ్వెంచర్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే మూవీలో హీరోయిన్ గా నటి ప్రియంక చోప్రాను ఫిక్స్ చేసినట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఆమె లాస్ ఏంజెలెస్ నుంచి భారత్ రావడంతో ఫిక్స్ అయ్యారు.

రీసెంట్ గా రాజమౌళి.. పాస్ పోర్ట్ పట్టుకుని సింహాన్ని లాక్ చేసినట్లుగా వీడియోను పోస్ట్ చేశారు. దానికి ప్రియాంక.. ఫైనల్లీ అని కామెంట్ చేశారు. దీంతో ఆమె సినిమాలో భాగమేనని అధికారికంగా ప్రకటించినట్లు అయింది. చెప్పాలంటే మహేష్ బాబు తర్వాత అఫీషియల్ గా వెలువడిన SSMB 29 క్యాస్టింగ్ కు సంబంధించి మరో పేరు ఆమెదే.

అయితే ప్రియాంక నేమ్ అఫీషియల్ గా ఫిక్స్ అయిన తర్వాత నుంచి మహేష్ బాబు ఫ్యాన్స్ కొందరు సోషల్ మీడియాలో అభ్యంతరం తెలుపుతున్న విషయం తెలిసిందే. మహేష్, ప్రియాంక పెయిర్ చూడముచ్చటగా ఉండదని, కాస్త ముదురుగా అనిపిస్తుందని అభిప్రాయపడుతున్నారు. మహేష్ కన్నా ప్రియాంక వయసు తక్కువే అయినా.. వేరే హీరోయిన్ ను తీసుకుంటే బాగుండేదని అంటున్నారు.

అయితే యువరాజు మూవీ మహేష్ సరసన సిమ్రాన్ యాక్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో చాలా మంది.. హీరోకు ఆమె అక్కలా ఉందని కామెంట్లు పెట్టారు. పెయిర్ అస్సలు బాగోలేదని అన్నారు. ఇప్పుడు ప్రియాంక, మహేష్ జోడీ కూడా బాగోదని.. జక్కన్న ఎందుకా నిర్ణయం తీసుకున్నారోనని డిస్కస్ చేసుకుంటున్నారు.

నిజానికి.. సినిమాకు సంబంధించి ఏ విషయంలో అయినా రాజమౌళి నిర్ణయం తీసుకున్నారంటే దాని వెనుక పెద్ద ప్లానే ఉంటుంది. ఇప్పుడు ప్రియాంక విషయంలో కూడా అదే జరిగి ఉండవచ్చు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న SSMB 29 మూవీకి మెయిన్ హీరోయిన్ ప్రియాంక అని ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.

అందుకే ఆమె రోల్ ఏంటో ఎవరికీ తెలియదు. కాబట్టి ఫ్యాన్స్ అప్పుడే టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పాలి. సినిమాలో చాలా క్యారెక్టర్లు ఉండడంతో ఫారిన్ యాక్టర్స్ ను కూడా జక్కన్న తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు మెయిన్ హీరోయిన్ గా ఫారిన్ బ్యూటీని తీసుకున్నారని సమాచారం. కాబట్టి ప్రియాంక విషయంలో రాజమౌళి ఏం ప్లాన్ చేశారో తెలియాలంటే వెయిట్ చేయక తప్పు. ఏదేమైనా జక్కన్న లెక్కే వేరు. ఆడియన్స్ పల్స్ ను ఇట్టే పట్టేస్తారు. కాబట్టి ఏం చేస్తారో వేచి చూడాలి.