ప్రాబ్లమ్ అంతా డిప్యూటీ సీఎంతోనేనా!
ఎస్ ఎస్ ఎంబీ 29 షూటింగ్ ఒడిశాలో ప్రారంభమైన నాటి నుంచి ఎలాంటి సవాళ్లు ఎదుర్కుంటున్నారో తెలిసిందే.
By: Tupaki Desk | 13 March 2025 12:39 PM ISTఎస్ ఎస్ ఎంబీ 29 షూటింగ్ ఒడిశాలో ప్రారంభమైన నాటి నుంచి ఎలాంటి సవాళ్లు ఎదుర్కుంటున్నారో తెలిసిందే. రోజుకోక లీక్ బయటకు వస్తోంది. కొండగుట్టల్లో షూటింగ్ జరుగుతున్నా? వీడియో లీకులు ఎలా జరుగుతున్నాయో అర్దం కాని పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ నుంచి ఎవరు ఎలా లీక్ చేస్తున్నారో కనిపెట్టడం కష్టంగా మారింది. సినిమాలో కీలకమైన సన్నివేశాల రఫ్ పుటేజీ బయటకు రావడంతో టీమ్ కూడా అంతే ఆందోళనకు గురవుతుంది.
సెట్స్ ప్రాంగణంలో ఎంత కఠినంగా ఉన్నా? ఏదో మూల నుంచి లీకు జరుగుతూనే ఉంది. అదంతా ఒకటైతే? ఒడిశా రాష్ట్ర డిప్యూటీ సీఎంతో మరో సమస్య దాపరించింది. తెలియని వాళ్ల నుంచి ఫోటోలు లీక్ అయ్యాయి? అంటే చింతించాల్సిన పనిలేదు. కానీ తెలిసిన వాళ్లే పబ్లిక్ గా లీక్ లు ఇవ్వడం మరింత సమస్యగా మారింది. ఒడిశా డిప్యూటీ సీఎం ప్రవతి ఫరీదా కోరాపుట్ లో షూటింగ్ జరుగుతోన్న విషయాన్ని సోషల్ మీడియాలో చెప్పడమే కాకుండా అక్కడ ఎవరెవరు? ఉన్నారో కూడా చెప్పేస్తున్నారు.
మహేష్, ప్రియాంక చోప్రా, రాజమౌళి, పృధ్వీరాజ్ సుకుమారన్ పై షూటింగ్ చేస్తున్నట్లు మరీ చెబుతున్నారు. వాస్తవానికి ఇందులో పృధ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నట్లు ఇంత వరకూ రాజమౌళి నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కానీ డీసీఎం చేసిన పనితో మొత్తం విషయం బయటకు వచ్చేసింది. సోషల్ మీడియా ఖాతాలో విషయాన్ని పూసగుచ్చి మరీ చెప్పారు.
దీంతో రాజమౌళి అండ్ కోకి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్దం కాలేదు. సామాన్యులకైతే చెప్పొచ్చు. ప్రభుత్వంలో పదవిలో ఉన్న వారికి ఎలా చెప్పాలో తెలియక ఆయన కూడా మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కడా ఒక్క విషయం కూడా బయటకు పొక్కకుండా ఉండాలి అన్నది జక్కన్న ప్లాన్. ముఖ్యంగా నటీనటుల విషయంలో ఆయన మరింత గోప్యత వహిస్తుంటారు. కానీ ఆ ప్రకారం జరగడం లేదు.